| Daily భారత్
Logo




భారతీయ జనతా పార్టీ ఓబిసి మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

News

Posted on 2025-09-26 14:02:20

Share: Share


భారతీయ జనతా పార్టీ ఓబిసి మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

చాకలి ఐలమ్మ నేటి తరం మహిళలు ఆదర్శంగా తీసుకోవాలి

అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

 డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గారు హాజరయ్యారు.ఈ సందర్బంగా బిజెపి ఓబీసీ మోర్చా నాయకులతో కలిసి వినాయక్ నగర్ విగ్రహాల పార్క్ వద్ద ఉన్న ఐలమ్మ విగ్రహానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ

నిజాం నిరంకుశ పాలనలో దొరలు, భూస్వాములు, పెత్తందారులు బడుగు, బలహీన వర్గాల ప్రజలను వెట్టిచాకిరీ చేపిస్తు బానిసలుగా చూస్తున్న రోజుల్లో చాకలి ఐలమ్మ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం దున్నేవాడిదే భూమి అంటు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా విస్నూర్ దేశ్ మఖ్ ను ఎదిరించిన తెలంగాణ వీర వనిత సాకాలి ఐలమ్మ అని అన్నారు. రాణి రుద్రమ్మ పౌరుషన్ని పాలు పంచుకున్న ఓరుగల్లు ముద్దు బిడ్డ సాకాలి ఐలమ్మ ఆనాడు ఆమె పండించిన పంటను దొర గుండాలు అక్రమంగా తీసుకెళ్తుంటే ఎదురు తిరిగి గుండాలను తరిమి కొట్టిన ఆమె విజయం తెలంగాణలో భూ పోరాటానికి నాంది పలికెల చేసిందన్నారు. సాకాలి ఐలమ్మ స్ఫూర్తి నేటి మహిళా లోకానికి ఆదర్శం అని ఆడది అంటే అభల కాదు ఆది పరశక్తి అని రుజువు చేసిన దీర మహిళా సాకాలి ఐలమ్మ అన్నారు. ఆడవాళ్లు అంటే వంటింటి కుందేళ్లు అనుకునే సమాజంలో బిజెపి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ మహిళా రిజర్వేషన్ బిల్ తెచ్చి యావత్ మహిళా లోకాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకుపోయే లక్ష్యంతో బిజెపి పనిచేస్తుందని అన్నారు. ఆపరేషన్ సిందూర్ లో ఇద్దరే మహిళలు ఖురేషి, వ్యోమిక ఉగ్ర స్థావరాలను  ధ్వంసం చేసి భారతీయ మహిళా నారీ శక్తి అంటే ఏంటో ప్రపంచానికి నిరూపించారని అన్నారు. నేటి తరం మహిళలు చాకలి ఐలమ్మ, రాణి రుద్రమ్మ, ఝాన్సీ లక్ష్మి భాయ్ లాంటి వీర వనితల పోరాట స్ఫూర్తితో వారిని ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాలను అవరోదించాలని సూచించారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు స్వామి యాదవ్, గిరి బాబు, నాగరాజు, బుస్సాపూర్ శంకర్ బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Image 1

ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ₹1 లక్ష డిమాండ్... సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్‌పై కేసు

Posted On 2026-07-10 18:53:44

Readmore >
Image 1

క్షణాల్లో స్పందించిన పిట్లం పోలీసులు : ఆత్మహత్యాయత్నం నుంచి మహిళకు రక్షణ

Posted On 2026-07-10 18:24:01

Readmore >
Image 1

విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త

Posted On 2026-07-10 17:31:57

Readmore >
Image 1

₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ

Posted On 2026-07-10 17:13:30

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు

Posted On 2026-07-10 16:20:54

Readmore >
Image 1

ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి

Posted On 2026-07-10 16:18:06

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి

Posted On 2026-07-10 14:47:58

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది

Posted On 2026-07-10 14:35:04

Readmore >
Image 1

లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

Posted On 2026-07-10 14:21:15

Readmore >
Image 1

ఎస్సీ సెల్ జూలూరుపాడు మండల అధ్యక్షుడు గా మంద బాబు

Posted On 2026-07-10 06:26:41

Readmore >