Posted on 2026-07-10 16:20:54
డైలీ భారత్: రాజన్న సిరిసిల్ల: అతివేగంగా, నిర్లక్ష్యంగా బస్సు నడిపి ముగ్గురి ప్రాణాలు తీసిన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అనుపురం గ్రామ శివారులో 09-07-2026న ఈ ఘోర ప్రమాదం జరిగింది.
మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాకు చెందిన వ్యవసాయ వలస కూలీలను కొదురుపాక గ్రామానికి చెందిన గంగాధర్ అనిల్ తన టాటా ఆటో ట్రాలీ AP 01 X 9735లో లక్ష్మీపూర్ గ్రామానికి తీసుకెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు TS23 T4700 ఆటో ట్రాలీని బలంగా ఢీకొట్టింది. బస్సును నడిపింది నిమ్మపల్లి గ్రామానికి చెందిన మాలోత్ నరాన్.
ప్రమాద తీవ్రతకు ఆటో ట్రాలీ బోల్తా పడింది. దీంతో చంద్రపూర్ కు చెందిన అతుల్ వాసుదేవ్ సోనులే 35 సంఘటనా స్థలంలోనే మరణించాడు. ట్రాలీలోని రంజు 48, అర్చన 37 వరంగల్ MGM ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
మిగతా కూలీలు మరియు ఆటో డ్రైవర్ గంగాధర్ అనిల్ కు 108 అంబులెన్సుల ద్వారా సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రి, వేములవాడ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ డ్రైవర్ మాలోత్ నరాన్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు.
ఈ ఘటనపై జిల్లా పోలీసులు వాహనదారులకు సూచనలు జారీ చేశారు. నిర్ణీత వేగంతో, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని, నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల అమాయకుల ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు
Posted On 2026-07-10 16:20:54
Readmore >
ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి
Posted On 2026-07-10 16:18:06
Readmore >
రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి
Posted On 2026-07-10 14:47:58
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది
Posted On 2026-07-10 14:35:04
Readmore >
లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్
Posted On 2026-07-10 14:21:15
Readmore >
తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
Posted On 2026-07-10 03:55:48
Readmore >
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్
Posted On 2026-07-09 15:56:35
Readmore >
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >