| Daily భారత్
Logo




ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి

News

Posted on 2026-07-10 16:18:06

Share: Share


ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి

డైలీ భారత్, కామారెడ్డి:  జిల్లాలో అక్రమ మద్యం విక్రయాలు, దాబాల్లో సిట్టింగులపై కామారెడ్డి జిల్లా పోలీసులు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. ప్రజల శాంతిభద్రతలకు భంగం కలిగించే ఇటువంటి అక్రమ కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, IPS స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో పిట్లం పోలీస్ స్టేషన్ పరిధిలోని పిట్లం గ్రామ శివారులో ఉన్న దుర్గ భవాని (సంతు) దాబా యజమాని రాథోడ్ సంతోష్ పై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.

గతంలో 30-08-2025న దాబాలో అనుమతి లేకుండా మద్యం విక్రయాలు, సిట్టింగులు నిర్వహించినందుకు రూ.50,000 బైండోవర్ ఇచ్చారు. అయినప్పటికీ 17-05-2026న మళ్లీ అక్రమ సిట్టింగులు నిర్వహిస్తున్నట్లు గుర్తించి పోలీసులు దాడి చేశారు.

బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించినందుకు 10-07-2026న పిట్లం ఎస్‌ఐ ఆంజనేయులు ఎమ్మార్వో సమక్షంలో రాథోడ్ సంతోష్‌పై రూ.15,000 జరిమానా విధించడంతో పాటు రూ.1,00,000 కు మళ్లీ బైండోవర్ చేయించారు.

"జిల్లాలోని ఏ దాబాలోనైనా అక్రమ కార్యకలాపాలు జరిగితే కఠిన చర్యలు తప్పవు. బైండోవర్ తర్వాత ఉల్లంఘిస్తే కేసులు కూడా నమోదు చేస్తాం" అని ఎస్పీ హెచ్చరించారు.


#Kamareddy #Pitlam #DailyBharatKamareddy #TelanganaPolice #KamareddySP #RajeshChandraIPS #Bindover #IllegalLiquor #DhabaRaid #PitlamSI #LawAndOrder #TelanganaNews #KamareddyNews

Image 1

రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు

Posted On 2026-07-10 16:20:54

Readmore >
Image 1

ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి

Posted On 2026-07-10 16:18:06

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి

Posted On 2026-07-10 14:47:58

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది

Posted On 2026-07-10 14:35:04

Readmore >
Image 1

లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

Posted On 2026-07-10 14:21:15

Readmore >
Image 1

ఎస్సీ సెల్ జూలూరుపాడు మండల అధ్యక్షుడు గా మంద బాబు

Posted On 2026-07-10 06:26:41

Readmore >
Image 1

తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి

Posted On 2026-07-10 03:55:48

Readmore >
Image 1

తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్

Posted On 2026-07-09 15:56:35

Readmore >
Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >