Posted on 2025-09-27 15:41:50
కొండా లక్ష్మణ్ బాపూజీ కి ఘన నివాళులు అర్పించిన రూరల్ ఎమ్మెల్యే..
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:తెలంగాణ ప్రదేశ్ కమిటీ మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ జయంతి సందర్భంగా ధర్మపురి నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి నిజాంబాద్ నగరంలోని కంటేశ్వర్ బైపాస్ లో గల ధర్మపురి శ్రీనివాస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మపురి శ్రీనివాస్ రాజ్యసభ సభ్యునిగా మాజీ మంత్రిగా పిసిసి అధ్యక్షునిగా ఎన్నో ఉన్నత పదవులు చేశారని, రెండు పర్యాయాలు పిసిసి అధ్యక్షుడిగా పనిచేసే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికరణ తీసుకువచ్చిన ఘనత డి శ్రీనివాస్ దే అన్నారు. డి శ్రీనివాస్ ఆశయాలను నెరవేర్చడానికి కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఉమ్మడి రాష్ట్రాన్ని నిజాంబాద్ జిల్లాలో ఎంతో అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత డి శ్రీనివాస్ దేని కొనియాడారు. అనంతరం వినాయక్ నగర్ లో గల ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 110 వ జయంతి సందర్బంగా పూల మాల వేసి నివాళులు అర్పించి తెలంగాణ రాష్ట్ర సాధనకై ఎలా పోరడు అన్న విషయాన్నీ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి కొనియాడారు. ఈ సందర్బంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ ఆసిఫాబాద్ వంకిడి గ్రామంలో జన్మించి స్వాతంత్రo కోసం పోరాటం చేశారన్నారు. ఆసిఫాబాద్ నుండి ఎమ్మెల్యే గా పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర సాధనకై తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్ర పోరాటంలో తన స్థలాన్ని కేటాయించి వాటర్ హౌస్ గా మార్చారు. అయన ఆశయాలను ప్రతి ఒక్క పౌరుడు ఆచరిస్తూ ముందుకు సాగాలి అని కొనియాడారు. కార్యక్రమం లో డీసీసీ జిల్లా అధ్యక్షులు మనలా మోహన్ రెడ్డి,ఎఏంసి చైర్మన్ ముప్పా గంగాధర్,డిచిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అమృతపూర్ గంగాధర్, మాజీ ఎంపీపీ యాదగిరి నాయక్, పద్మశాలి నగర అధ్యక్షులు పెంటూ దత్తద్రి, తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ₹1 లక్ష డిమాండ్... సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్‌పై కేసు
Posted On 2026-07-10 18:53:44
Readmore >
క్షణాల్లో స్పందించిన పిట్లం పోలీసులు : ఆత్మహత్యాయత్నం నుంచి మహిళకు రక్షణ
Posted On 2026-07-10 18:24:01
Readmore >
విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త
Posted On 2026-07-10 17:31:57
Readmore >
₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ
Posted On 2026-07-10 17:13:30
Readmore >
రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు
Posted On 2026-07-10 16:20:54
Readmore >
ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి
Posted On 2026-07-10 16:18:06
Readmore >
రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి
Posted On 2026-07-10 14:47:58
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది
Posted On 2026-07-10 14:35:04
Readmore >
లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్
Posted On 2026-07-10 14:21:15
Readmore >