| Daily భారత్
Logo




జల్సా లకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్న ముఠా సభ్యులు అరెస్ట్

News

Posted on 2025-09-28 12:18:14

Share: Share


జల్సా లకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్న ముఠా సభ్యులు అరెస్ట్

వివరాలు వెల్లడించిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఇటీవల ఐదవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన చోరీ కేసులో పోలీసులు వేగవంతంగా దర్యాప్తు చేశారు. ఇందులో చోరీకి పాల్పడిన నిందితులను అరెస్టు చేసినట్లు నిజామాబాద్ సిపి సాయి చైతన్య తెలిపారు. 

ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సిపి చోరీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈనెల 23న ఈనెల 23న నాగారం ప్రాంతంలోని బ్రాహ్మిన్స్ కాలనీ కి చెందిన ఫిర్యాదుదారుడు వేలేటి పవన్ శర్మ, ఆయన తండ్రి పేరు వేలేటి గౌరీ శంకర్ శర్మ పౌరహిత్యం కొనసాగిస్తూ జీవనం సాగిస్తుంటారని తెలిపారు. అయితే వారి ఇంట్లో దొంగతనానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయగా 33తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈనెల 23 న నాగారం లో తాళం వేసిన ఇంట్లో చొరబడ్డ దొంగలు ఐదుగురు సభ్యులు ఒక ముఠా గా ఏర్పడి దొంగతనాలకు పాల్పడ్డట్లు గుర్తించామన్నారు. నిందితుల్లో ఆకాష్, షేక్ సల్మాన్ లు పట్టుబడ్డారని,మరో ముగ్గురు పరారీ లో ఉన్నట్లు వారిని కూడా  త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

అలాగే రానున్న దసరా సెలవుల నేపథ్యంలో ఊరికి వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి ఇంటికి నేరాల నియంత్రణ కోసం సీసీ కెమెరాలు అమర్చుకోవాలని ప్రజలకు సూచించారు. దొంగతనాల నివారణ కోసం నిజామాబాద్ పోలీస్ కమిషనరెట్ లోని అన్ని పోలీస్ స్టేషన్ లలో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కేసు చేదనకు నిజామాబాద్ ఏసిపి ఎల్ రాజా వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో రెండు టీంలుగా ఏర్పడి నార్త్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి శ్రీనివాస్, సబ్ ఇన్స్పెక్టర్ ఎం గంగాధర్, లతోపాటు క్రైమ్ టీం, ఐదవ పోలీస్ స్టేషన్ సిబ్బంది కేసును వివిధ కోణాలలో పరిశోధించి ఈ దొంగతనం కేసులో నిందితులుగా ఉన్న షేక్ సల్మాన్ అలియాస్ సోను, మరాఠీ ఆకాష్లను పట్టుకున్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకున్న పోలీస్ సిబ్బందిని సిపి సాయి చైతన్య అభినందించారు.

Image 1

ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ₹1 లక్ష డిమాండ్... సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్‌పై కేసు

Posted On 2026-07-10 18:53:44

Readmore >
Image 1

క్షణాల్లో స్పందించిన పిట్లం పోలీసులు : ఆత్మహత్యాయత్నం నుంచి మహిళకు రక్షణ

Posted On 2026-07-10 18:24:01

Readmore >
Image 1

విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త

Posted On 2026-07-10 17:31:57

Readmore >
Image 1

₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ

Posted On 2026-07-10 17:13:30

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు

Posted On 2026-07-10 16:20:54

Readmore >
Image 1

ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి

Posted On 2026-07-10 16:18:06

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి

Posted On 2026-07-10 14:47:58

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది

Posted On 2026-07-10 14:35:04

Readmore >
Image 1

లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

Posted On 2026-07-10 14:21:15

Readmore >
Image 1

ఎస్సీ సెల్ జూలూరుపాడు మండల అధ్యక్షుడు గా మంద బాబు

Posted On 2026-07-10 06:26:41

Readmore >