Posted on 2025-10-04 09:47:03
బీఆర్ఎస్ పార్టీ నాయకులు యల్లంకి సత్యనారాయణ లకావత్ గిరిబాబు
డైలీ భారత్ ,భద్రాద్రి కొత్తగూడెం: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జూలూరుపాడు మండల కేంద్రంలో యల్లంకి సత్యనారాయణ నివాసంలో జూలూరుపాడు మండల విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహణజూలూరుపాడు మండల కేంద్రంలో యల్లంకి సత్యనారాయణ నివాసంలో జూలూరుపాడు మండల పార్టీ కమిటి ఆధ్వర్యములో విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశము నిర్వహించారుఈ సమావేశానికి వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు హాజరై జూలూరుపాడు మండల, గ్రామ కమిటి కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తూరానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో మన BRS పార్టీ అభ్యర్ధులను గెలిపించాలని, విభేదాలను పక్కన పెట్టి ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలలో BRS పార్టీ అభ్యర్ధులు ఘన విజయం సాధించేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలనీ తెలిపారు.. ఇందుకోసం కార్యకర్తలంతా సమష్టిగా ముందుకెళ్లాల్సిన అవసరముందిస్థానిక సంస్థల ఎన్నికలను నాయకులు, కార్యకర్తలు ఆషామాషీగా తీసుకోవద్దని, రాత్రిబవంళ్లు కష్టపడి పనిచేస్తేనే మన లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, మన పార్టీ గెలువకుండా కార్యకర్తలను ఇబ్బంది పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులకు గురిచేసే అవకాశమున్నదని పేర్కొన్నారుమనమంతా ధైర్యంగా ముందుకెళ్లి ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకోవల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారిని స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబెట్టాలని సూచించారుతెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, కాంగ్రెస్ పార్టీని గెలిపించి తప్పుచేశామని ప్రజలు పశ్చాత్తాపపడుతున్నాని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారుఅసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీనీ సక్రమంగా అమలు చేయలేదని తెలిపారు. ముఖ్యంగా రైతులు యూరియా కోసం అల్లాడుతున్నారని ఒక్క యూరియా బస్తా కోసం రోజుల తరబడి సహకార సంఘాల ఎదుట నిలబడుతున్నారని పేర్కొన్నారుపింఛన్లు పెంచలేదని, రుణమాఫీ చేయలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఈ అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవాలని పేర్కొన్నారుకాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ధైర్యం లేదన్నారు. కోర్టు ఆదేశాలతోనే ఎన్నికల నిర్వహణకు ముందుకొచ్చిందని, ఈ ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారుముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రతి నాయకుడు, కార్యకర్త కలిసికట్టుగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని, పంతాలకు వెళ్లకుండా పార్టీని గెలిపించేందుకు కృషి చేయాలనిబీఆర్ ఎస్ పార్టీ నాయకులు యల్లంకి సత్యనారాయణ లకావత్ గిరిబాబు అన్నారు ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ చాపలమడుగు రామ్మూర్తి, లకావత్ హేమ్లా రెడ్డిబోయిన రాము, మాజీ ఎంపీపీ మూడు చిట్టిబాబు, యదలపల్లి వీరభద్రం, బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు భూక్యా సేవా, దుద్దుకూరి కృష్ణ ప్రసాద్, కొడెం సీతాకుమారి, పదిమళ్ళ రాంబాబు, తాళ్లూరి రామారావు, సాయిని హరీష్, భూక్యా చందు, దిగిన్ని అప్పారావు, బానోత్ శంకర్, వెంకన్న మరియు తదితరులు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
Posted On 2026-07-10 03:55:48
Readmore >
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్
Posted On 2026-07-09 15:56:35
Readmore >
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >