Posted on 2025-10-04 15:23:20
అన్నదానం ఎంతో పవిత్రమైనది
పాత పాల్వంచ సాయిబాబా దేవాలయంలో పుణ్యస్థితి పూజలు
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న అని అన్నదానం ఎంతో పవిత్రమైనదని రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్,డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాత పాల్వంచ లోని శ్రీ షిరిడి సాయిబాబా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న సాయిబాబా 107వ పుణ్యస్థితి (సమాధి) పూజోత్సవాల్లో* భాగంగా శనివారం సుమారు *1000 మంది భక్తులకు మహా అన్నదానం నిర్వహించారు. పూజారి దాసోజు సతీష్ ఆచార్యులు ఆధ్వర్యంలో షిరిడి సాయిబాబాకు అఖండ దీపారాధన, ఉద్వాసన,ధుని పూజలు నిర్వహించారు. అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న కొత్వాల మాట్లాడుతూ భక్తులకు అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుందన్నారు. సాయిబాబా కు అన్నదానం ఎంతో ఇష్టమని కొత్వాల అన్నారు.
ఈ కార్యక్రమంలో దేవాలయం ధర్మకర్తల మండలి వ్యవస్థాపకులు ఆలయ ధర్మకర్త ముత్యాల కోటేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ కొత్వాల సత్యనారాయణ, గంధ మల్ల రాజయ్య,పాశం నాసరయ్య, గూడపాటి నాగేశ్వరరావు, ముదిగొండ శ్రీనివాసరావు,బొట్టు రమేష్,చింతలచెరువు,జనార్ధన రెడ్డి,మాజీ జడ్పిటిసి ఎర్రం శెట్టి ముత్తయ్య,కాంగ్రెస్ నాయకులు కొండం వెంకన్న,వై వెంకటేశ్వరరావు, లోగాని సత్యనారాయణ,దోప్పలపూడి వెంకటేశ్వరరావు,పాశం నరసింహారావు,పాశం గోపాలరావు పెద్దింటి రాంబాబు, మహేందర్, ఉట్కురి శ్రీను,వంగ రమేష్,రౌతు మల్లేష్,బర్ల అన్వేష్,శంకర్ రెడ్డి, అమృతవల్లి శైలజ,ముత్యాల కృష్ణవేణి,వరలక్ష్మి,కృష్ణకుమారి, పార్వతమ్మ,ఆకుల కృష్ణవేణి, సునీత,జ్యోతి, విజయలక్ష్మి, శివరంజని, సావిత్రమ్మ,గీత,సంధ్య, భాగ్యలక్ష్మి,తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
Posted On 2026-07-10 03:55:48
Readmore >
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్
Posted On 2026-07-09 15:56:35
Readmore >
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >