Posted on 2025-10-04 17:01:17
మహిళలు,చిన్నారుల భద్రత సురక్షత ముఖ్యం.
ఈ నెల లో ఆకతాయిల వేధింపుల పై ప్రత్యేక దృష్టి సారింపు.
మహిళలను వేధించిన, మహిళల సమస్యల కై అందుబాటులో నిజామాబాదు షీ టీం
గత నెలలో 80 సార్లు హాట్స్పాట్ ల తనిఖీ.
11 ఈ పెట్టి కేసుల నమోదు.
07 కౌన్సిలింగ్ నిర్వహించి సమస్య పరిష్కారం.
నిజామాబాద్ సిపి పి.సాయి చైతన్య వెల్లడి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఆపద సమయంలో అతివలకు అండగా నిజామాబాదు షి టీం బృందం 24 గంటలు అందుబాటులో ఉంటూ సేవలందిస్తుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య తెలిపారు. జిల్లాలో మహిళలు , చిన్నారుల భద్రతకై , రక్షణకై నిజామాబాదు జిల్లా షీ టీం బృందం అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తూ ప్రజల రక్షణకై విధులను నిర్వర్తిస్తుందని , ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ దుర్గా నవరాత్రి ఉత్సవాలలో రాత్రి సమయాలలో ఆకతాయిలు అల్లరి చేస్తూ మహిళలను వేధించిన సందర్భాలలో రెడ్ హ్యాండెడ్ గా ఈ నెలలో 19 కేసులు నమోదు చేసినట్లు , షీ టీం బృందం ప్రత్యేకంగా రాత్రి సమయాలలో రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలలో సంచరిస్తూ మహిళలను వేధిస్తున్న వారిపై దృష్టి సారించిందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నిజామాబాదు షీ టీం బృందాలు యువతులకు , విద్యార్థిని విద్యార్థులకు , పని స్థలాలలో మహిళలకు ప్రత్యేకంగా 26 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి చైతన్య పరచడం జరుగుతుందని, ఈ సందర్భంగా సెప్టెంబర్ నెలలో షీ టీం బృందాల ద్వారా 11 ఈ పెట్టీ కేసుల నమోదు చేయడం జరిగిందని తెలిపారు. షీ టీం బృందాలు గత నెల రోజులలో జిల్లా వ్యాప్తంగా 80 హాట్స్పాట్ల లో తనిఖీ చేయడం జరిగిందన్నారు. పలు గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. షి టీం బృందం సభ్యులు చాకచక్యంగా వ్యవహరిస్తూ నవరాత్రి ఉత్సవాలలో ప్రత్యేక బృందంచే మహిళలకు రక్షణగా , మహిళలు వేధింపులకు గురికాకుండా అడ్డుపడుతూ ఆకతాయిల పట్ల చట్టపరంగా వ్యవహరిస్తూ ఉందని తెలిపారు. 07 కౌన్సిలింగ్ ల ద్వారా కేసులలో పరిష్కారం చూపబడింది అని తెలిపారు. ఆపత్కాల సమయంలో నిజామాబాద్ షి టీం బృందాల ను సంప్రదించాలంటే 8712659795నంబర్ కు ఫోన్ ద్వారా సంప్రదించాలన్నారు. 26 గ్రామాలలో కార్యక్రమాలు నిర్వహించి మహిళల పట్ల జరిగే నేరాలపై , చైల్డ్ మ్యారేజ్ , సైబర్ నేరాలపై , సోషల్ మీడియా నేరాలపై , చిన్నారులకు గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ లపై అవగాహనలు కల్పించి చైతన్యపరచడం జరిగిందని తెలియజేశారు. ఈ నెలలో మహిళల సమస్యలతో దాదాపు 07 మొబైల్ ఫోన్ కాల్స్ వచ్చినట్లు వారికి తగిన సమస్య పరిష్కారానికి కృషి చేసినట్లు తెలిపారు. షీ టీం బృంద సభ్యులు మహిళా ఆర్ ఎస్ ఐ శ్రవంతి , హెడ్ కానిస్టేబుల్లు సుమతి , ఆశయ్యా , కానిస్టేబుల్ లు విగ్నేష్ , శ్రీకాంత్ , నాగరాజు , రేఖా రాణి , హరిత రాణి , రాధిక మరియు మహిళా సిబ్బంది షీ టీం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మహిళలకు , చిన్నారులకు రక్షణగా నిజామాబాదు పోలీస్ వ్యవస్థ 24 గంటలు అందుబాటులో ఉంటూ సేవలందిస్తుందని హామీ ఇచ్చారు.
తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
Posted On 2026-07-10 03:55:48
Readmore >
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్
Posted On 2026-07-09 15:56:35
Readmore >
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >