Posted on 2025-10-05 14:02:45
మాదకద్రవ్యాల వైపు యువత మొగ్గుచూపకుండా చర్యలు
మహిళల రక్షణకోసం కొత్త చట్టాలపై అవగాహణ, మార్చ్ నుండి సెప్టెంబర్ వరకు 117 అవగాహణ కార్యక్రమాల నిర్వాహణ
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడి
డైలీ భారత్ న్యూస్,నిజామాబాద్: పోలీస్ కమిషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పోలీస్ స్టేషన్ల పరిధిలలో గల గ్రామాలకు పోలీస్ కళాబృందం వెళ్లి ప్రజలను చైతన్య పర్చడం జరుగుతుందని సిపి పి.సాయి చైతన్య తెలియజేశారు. పోలీస్ సిబ్బంది ఒక కళాబృందముగా ఏర్పడి ప్రతీ పల్లెలో తీవ్రతరమైన సైబర్ నేరాలు, డ్రగ్స్ వినియోగం, మహిళల రక్షణ, ముఢనమ్మకాల పై అవగాహన కల్పిస్తూ, ప్రజలను కొంత మంది స్వార్ధ పరులు వారి యొక్క బలహీనతను సొమ్ము చేసు కుంటునారన్న సమాచారం మేరకు ప్రజల మనస్సులో ఇంకా పటిష్టoగా ఉండటాన్ని దృష్టిలో పెట్టుకుని నిజామాబాద్ జిల్లా పోలీస్ శాఖ కళాబృందం వినూత్న ప్రచార పద్ధతులను చేపట్టింది. పలెల్లల్లో, పట్టణాల్లో సాగుతున్న ఈ కార్యక్రమాల్లో కళా బృందం పాటల నాటకాల రూపంలో ప్రజలను అలరిస్తూనే, మోసపూరిత మానసిక దోపిడి నుంచి వారిని కాపాడే సందేశానీ చక్కగా
విరబూస్తోందన్నారు.
నిజామాబాద్ పోలీస్ వ్యవస్థ ఒక పేరు" పోలీను కళా బృందం " ఇందులో భాగంగా ప్రజల జీవితాలలో వెలుగు నింపుటకు స్వచ్చంద కార్యక్రమం చేపట్టింది. అట్టి స్వచ్చంద పోలీసు వ్యవస్థ వీరు ప్రతీ పల్లె పల్లెలు తిరిగి రాత్రి ఆనక, పగలు అనక ప్రజలకు పాటల రూపంలో మరియు నాటక రూపాలలో పీడిత ప్రజలను చైతన్య పరుస్తూ వారి బయందోళనలను పారద్రోలివారి జీవితాలలో వెలుగు నింపటముతో నిజామాబాద్ పోలీస్ కళా బృందం సభ్యులు అహార్నిషలు కృషి చేస్తున్నారు.
ఇందులో ప్రధానంగా పోలీస్ కళాబృందం చైతన్య పరుస్తున్న అంశాలను వివరించారు. కల్తీ కల్లు వద్దు జీవితం ముద్దు, కల్తీ కల్లువలన అనారోగ్యానికి గురవుతారని అన్నారు.
ముఖ్యంగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని, రోడ్డు ప్రమాదాలకు ముఖ్య కారణం హెల్మేటు పెట్టు కోకపోవడం, సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం. అతి వేగంగా వెల్లడం, మద్యం సేవించి వాహానం నడపటం, రాంగ్ రూట్లో వెల్లడం,ప్రతీ ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబందనలు ప్రతీ ఒక్కరు పాటించాలని రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలని, ప్రతీ ఒక్కరి ప్రధాన కర్తవ్యం అన్నారు. మహిళల రక్షణ కోసం ప్రస్తుతం కొత్త చట్టాలపై మహిళలకు అవగాహణ, వారి రక్షణే ప్రధాన ధ్వేయంమన్నారు. మహిళలు ఏవైనా అసౌకర్యానికి గురైనప్పుడు షీ టీమ్ నెంబర్ 87126-59795 లేదా డయల్ 100 కు కాల్ చేసి సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆన్లైన్ మోసాల పై హెచ్చరిక సైబర్ మోసాల నుండి రక్షణ కోసం అప్రమత్తంగా ఉండండి. ఏదైనా మోసానికి గురైతే టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు ఫోన్ చేయాలని,మాదకద్రవ్యాల వినియోగం నేరం చట్టపరమైన శిక్షకు లోనవుతారు. యువత మాదక ద్రవ్యాల నుంచి దూరంగా ఉండాలన్నారు.
ప్రతీ గ్రామంలో సి.సి కెమెరాల ఏర్పాటు వాటి సంరక్షణ, చైన్ స్నాచర్ల గురించి తీసుకోవలసిన జాగ్రత్తలు మొదలగు వాటిపై పాటలతో, నాటకాలతో, మాటలతో ప్రజలకు అర్ధం అయ్యే విధంగా అవగాహాణ కల్పించడం జరుగుతుందన్నారు. నిజామాబాద్ పోలీస్ కళా బృందం వారు మార్చ్ 2025 నుండి సెప్టెంబర్ 2025 వరకు 117 కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కళా బృందానికి రిజర్వు ఇన్స్పెక్టర్ (అడ్మిన్) శ్రీనివాస్ ఇంచార్జీగా ఉంటూ. ఎ.ఆర్.ఎస్ శ్రీనివాస్, కానిస్టేబుళ్లు శేఖర్, విక్రమ్, మహిళా హోమ్ గార్డు సీత, అవుట్ సోర్స్ బాల రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కళాబృందానికి అన్ని గ్రామాలలో ప్రదర్శన సమయంలో మంచి స్పందన వస్తుందని, ప్రజల లో చైతన్యం తీసుకొని రావడం మాత్రమే తమ ప్రధాన కర్తవ్యం అని ప్రధానంగా సామాజిక అంశాలు, చట్టాలు, హక్కులపై చాలా మందికి అవగాహాన కల్పించడం జరిగిందని, నూతన పద్ధతులతో ప్రజలలోకి వెలుతున్నారని, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య వెల్లడించారు. ఈ కళాబృందం పర్యటనల వలన ప్రతీ గ్రామాలలో ఎంతో మార్పూరావడం జరుగుతుందన్నారు. ఆన్లైన్ మోసాల గురించి కూడా ప్రజలను చైతన్యం చేయడం జరిగిందన్నారు. సైబర్ నేరగాండ్ల బారీన పడకుండా జాగ్రత్తలు పాటించాలని తెలియజేశారు.
తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
Posted On 2026-07-10 03:55:48
Readmore >
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్
Posted On 2026-07-09 15:56:35
Readmore >
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >