| Daily భారత్
Logo




తెలంగాణ రాష్ట్రంలోనే నిజామాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం సేవలో ముందుండేలా పని చేద్దాం

News

Posted on 2025-10-05 14:01:19

Share: Share


తెలంగాణ రాష్ట్రంలోనే నిజామాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం సేవలో ముందుండేలా పని చేద్దాం

నా డిక్షనరీలో రెండే రెండు పదాలకు స్థానం నియోజకవర్గ ప్రజల అభివృద్ధి, వారికి సేవ చేయాలనే సంకల్పం

పట్టణ ఆర్యవైశ్య సంఘం దసరా ఆత్మీయ సమ్మేళనంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కిసాన్ గంజ్ లో ఆదివారం పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దసరా సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మున్సిపల్ నిజామాబాద్ చైర్మన్ ముక్కా దేవేందర్ గుప్తా పట్టణ ఆర్యవైశ్య సంఘం అభివృద్ధి కోసం నిరంతరంగా పనిచేస్తూ వస్తున్నారని తనను చూసి నేటితరం ఆర్యవైశ్యులు ఆదర్శంగా తీసుకొని పార్టీలకు అతీతంగా అందరం ఆర్యవైశ్య సంఘం అభివృద్ధికి చేయాలని పిలుపునిచ్చారు. మహిషాసుర రాక్షసున్ని అమ్మవారు అంతముందించినందుకే హిందువులందరము అధర్మం మీద ధర్మం గెలిచిందని దసరా పండగ జరుపుకుంటామని ఆయన అన్నారు. ఇప్పటినుంచి అయినా వచ్చే దసరా వరకు  అందరిలోని దుర్గుణాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో గడుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఆర్యవైశ్యులు ఇతర పార్టీలలో ఉన్నప్పటికీ అంతిమ లక్ష్యం ఆర్యవైశ్యుల అభివృద్ధి ద్యేయం పెట్టుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పార్టీలకతీతంగా ఆర్యవైశ్యులం ఐక్యంగా ఉండి పనిచేద్దామని అప్పుడే తెలంగాణ రాష్ట్రంలోనే నిజామాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం సేవలు అభివృద్ధిలో ముందు వరుసలో నిలబడాలని ఆయన అన్నారు. తన డిక్షనరీలో రెండే రెండు పదాలకు చోటు ఉంటాయని ఒకటి తనను నమ్మి ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గ ప్రజల అభివృద్ధి, రెండు నా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు వెళుతున్నానని ఆయన అన్నారు. అలాగే తన ఆర్యవైశ్య సంఘం అభివృద్ధికి కూడా ప్రభుత్వంతో సంబంధం లేకుండా తన వంతు సహకారం ఎల్లవేళలా ఉంటుందని భరోసానిచ్చారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ముక్క దేవేందర్ గుప్తా, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ధన్పాల్ శ్రీనివాస్ గుప్తా, ప్రధాన కార్యదర్శి ఇల్లెందుల ప్రభాకర్ గుప్తా, కోశాధికారి గాలి నాగరాజు గుప్తా, ప్రోగ్రాం కన్వీనర్లు వీరమల్లి రమేష్ గుప్తా, పబ్బరాజు గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఎమ్మెల్యేలను ఘనంగా సత్కరించారు.

Image 1

ఎస్సీ సెల్ జూలూరుపాడు మండల అధ్యక్షుడు గా మంద బాబు

Posted On 2026-07-10 06:26:41

Readmore >
Image 1

తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి

Posted On 2026-07-10 03:55:48

Readmore >
Image 1

తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్

Posted On 2026-07-09 15:56:35

Readmore >
Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >