| Daily భారత్
Logo




ఈ నెల16న శ్రీశైలానికి పీఎం మోదీ

News

Posted on 2025-10-06 13:05:23

Share: Share


ఈ నెల16న శ్రీశైలానికి పీఎం మోదీ

16న శ్రీశైలానికి పీఎం మోదీ - రూ.1,657 కోట్లు సహాయం కోరనున్న దేవస్థానం

శ్రీశైలం దర్శనానికి ప్రధాని మోదీ - ఆర్థిక సహాయం చేయాలని ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రస్తావించనున్న ఆలయ యాజమాన్యం

డైలీ భారత్, శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రం అభివృద్ధికి నూతన ప్రతిపాదనలను దేవస్థానం అధికారులు సిద్ధం చేశారు. ఈ నెల 16వ తేదీన ప్రధాని మోదీ శ్రీశైలం దర్శనానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీశైల మల్లన్న ఆలయానికి దాదాపు రూ.1,657 కోట్ల ఆర్థిక సహాయం చేయాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఆధ్వర్యంలో ప్రధానిని కోరనున్నారు.

క్షేత్రంలో కాశీ విశ్వనాథ్‌ కారిడార్, ఉజ్జయిని మహాకాళ్‌ కారిడార్‌ తరహాలో శ్రీశైల క్షేత్ర కారిడార్‌ను అభివృద్ధి చేయడానికి సదరు నిధులు వినియోగించాలని దేవాదాయశాఖ, దేవస్థానం అధికారులు యోచిస్తున్నారు. అందుకుగాను రూ.90 కోట్లతో నూతన క్యూకాంప్లెక్స్, రూ.65 కోట్లతో గంగాధర మండపం నుంచి నందిమండపం వరకు సాలుమండపాల నిర్మాణం, రూ.25 కోట్లతో కైలాస మానస సరోవరం-ఏనుగుల చెరువు కట్ట అభివృద్ధి, రూ.25 కోట్లతో కైలాస కళాక్షేత్రం, రూ.13 కోట్లతో నూతన ప్రసాదాల తయారీ పోటు నిర్మాణం, రూ.10 కోట్లతో సామూహిక అభిషేక మండప నిర్మాణం, రూ.5 కోట్లతో దేవస్థానం వర్క్‌షాప్‌ నుంచి రుద్రపార్కు వరకు బ్రిడ్జి నిర్మాణం, రూ.95 కోట్లతో సిద్ధరామప్ప కొలను అభివృద్ధి పనులు చేయాలని ఈవో ఎం. శ్రీనివాసరావు ఇప్పటికే దేవాదాయశాఖ అనుమతి కోరారు.

శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థానం అభివృద్దిపై దేవాదాయ, అటవీశాఖలతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమీక్షకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలిగిన దివ్యక్షేత్రంగా వెలుగొందుతున్న ఆలయ సమగ్రాభివృద్దిపై చర్చించారు. ఏటా లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నందున వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించే ప్రణాళికలపై చర్చ చేపట్టారు. తిరుమల తరహాలోనే శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేసేలా కార్యాచరణకు ముఖ్యమంత్రి ఆదేశించారు.

దేవాలయ అభివృద్ధి కోసం 2,000 హెక్టార్ల భూమిని దేవాదాయశాఖకు కేటాయించేలా కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించిన్నట్లు తెలుస్తోంది. శ్రీశైల క్షేత్రానికి జాతీయ రహదారులను అనుసంధానించేలా ప్రణాళికలు చేయాలని సీఎం సూచించారు. శ్రీశైలంలోని పులుల అభయారణ్యం అభివృద్ధికి సూచనలు చేశారు. భక్తుల సంఖ్య ఏటేటా పెరుగుతున్న కారణంగా, ఆలయ సమగ్రాభివృద్దికి సత్వర చర్యలు అవసరం అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్న సందర్భంగా సౌకర్యాలు విస్తరించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. శబరిమల సహా ఇతర దేవాలయాల్లో సౌకర్యాలను పరిశీలించి శ్రీశైలాన్ని అభివృద్ది చేద్దామని స్పష్టం చేశారు

Image 1

ఎస్సీ సెల్ జూలూరుపాడు మండల అధ్యక్షుడు గా మంద బాబు

Posted On 2026-07-10 06:26:41

Readmore >
Image 1

తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి

Posted On 2026-07-10 03:55:48

Readmore >
Image 1

తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్

Posted On 2026-07-09 15:56:35

Readmore >
Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >