Posted on 2025-10-16 14:32:01
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా
డైలీ భారత్, నిజామాబాద్:టిఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకున్నా, కష్ట సమయంలో తాము ఉన్నామంటూ 30వ డివిజన్ కు చెందిన మైనార్టీ నాయకులు మతిన్ ఆధ్వర్యంలో సుమారు 200 మంది మైనార్టీ యువకులు మాజీ అర్బన్ ఎమ్మెల్యే ది సుమారు 200 మంది మైనార్టీ యువకులు మాజీ అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలో లేకున్నా కష్టకాలంలో తామున్నామంటూ పార్టీకి అండగా నిలిచిన మైనార్టీ నాయకులను పార్టీ ఎప్పటికీ మర్చిపోదని ఆయన అన్నారు. పదేళ్లపాటు పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పార్టీ వెంట నడిచిన వారు అధికార దాహంతో ఇతర పార్టీలో చేరిన వారు తన దృష్టిలో గాడిదలతో సమానమని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అర్బన్ నియోజకవర్గం స్వర్ణ భూమిని తలపించిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్బన్ నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడ్డదని ఆయన విమర్శించారు. స్థానిక అర్బన్ బిజెపి ఎమ్మెల్యే తన చేతిలో ఏమీ లేదని రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తేనే తాను ఏమైనా చేయొచ్చని చేతులెత్తేసారని, ఇక అర్బన్ నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ బడా నేతలుగా చెప్పుకునే నేతలు తమ స్వలాభం కోసం అధికారాల కోసం నామినేటెడ్ పోస్టుల పోస్టులు పెట్టారే కానీ ప్రజలకు ఏం అవసరమో అవి చేయడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఎవరికి తాగడానికి కనీసం నీరు కూడా సరైన సమయంలో అందివ్వని దౌర్భాగ్యమైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇక తన హయాంలో నగరం మొత్తం వీధి దీపాలతో వెలిగేవని ఇప్పుడు వీధి దీపాలు ఒక ప్రాంతంలో వస్తే ఇంకో ప్రాంతంలో రాని పరిస్థితి నెలకొందని ఆయన విమర్శించారు. ఇప్పుడు ఏమీ ఎన్నికలు లేకున్నా గాని పార్టీలోకి వచ్చిన వారిని పార్టీ కనురెప్పల చూసుకుంటుందని ఆయన అన్నారు. వచ్చేది మన పార్టీ నేనాని ఎవరు ఆందోళన నిరాశకు గురవద్దని ఆయన పేర్కొన్నారు. పార్టీలో నూతనంగా వచ్చిన వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో నగర అధ్యక్షులు సిర్ప రాజు, మాజీ కార్పొరేటర్ పార్టీ సీనియర్ నాయకులు దండు శేఖర్, మాజీ నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >