| Daily భారత్
Logo




మునిపల్లి గ్రామ అభివృద్ధికి 2 కోట్ల 29 లక్షల నిధులు మంజూరు

News

Posted on 2025-10-16 15:15:03

Share: Share


మునిపల్లి గ్రామ అభివృద్ధికి 2 కోట్ల 29 లక్షల నిధులు మంజూరు

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం జక్రాన్‌పల్లి మండలంలోని ఆర్గుల్, మునిపల్లి గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా తెలంగాణ మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను గురువారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మునిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి పనుల కోసం రూ.2 కోట్ల 29 లక్షల నిధులను మంజూరు చేశామని తెలిపారు. మునిపల్లి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటైన మొక్కజొన్న కొనుగోలు కేంద్రం రైతులకు ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం మొక్కజొన్న కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.2400గా నిర్ణయించిందని, ఈ కేంద్రాల ఏర్పాటుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  ప్రత్యేక కృషి చేశారని తెలిపారు. మహిళల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ, కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఉచిత బస్సు ప్రయాణం, సోలార్ ప్లాంట్లు, వడ్డీ లేని రుణాలు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరా శక్తి క్యాంటీన్ వంటి పథకాల ద్వారా మహిళలకు అండగా ఉంటోందని చెప్పారు. బీసీ 42 శాతం రిజర్వేషన్‌కు బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు వ్యతిరేకంగా ఉన్నాయని, శాసనసభలో చట్టం చేసి గవర్నర్‌కు, కేంద్రానికి పంపిన బిల్లు బిజెపి, బిఆర్ఎస్ ఎంపీలు అడ్డుకుంటున్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధి కొనసాగించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి సంక్షేమ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల కలలు నిజమవుతున్నాయని చెప్పారు. మన నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. మునిపల్లి గ్రామంలో మహిళా భవన్,లక్ష్మి నరసింహస్వామి ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు.


ఈ కార్యక్రమంలో మాజీ ఐసిడిఎంఎస్ చైర్మన్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, అర్గుల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గంగారెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చిన్నారెడ్డి, మాజీ సర్పంచ్ చిన్న సాయి రెడ్డి, యూత్ నాయకుడు వినోద్, తహసీల్దార్ కిరణ్మయి, సంఘ డైరెక్టర్లు, సిబ్బంది, రైతులు , మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >