| Daily భారత్
Logo




తెలంగాణలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు షెడ్యూల్ ఖరారు

News

Posted on 2024-01-04 18:29:08

Share: Share


తెలంగాణలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు షెడ్యూల్ ఖరారు

డైలీ భారత్ , హైదరాబాద్:తెలంగాణలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్‌ను విడుదల చేసింది.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిలు శాసన సభ ఎన్నికల్లో గెలుపొందడంతో తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు.

దీంతో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికలకు షెడ్యూల్‌ను ప్రకటించింది

ఈ నెల 11వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనుంది. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. 18వ తేదీన నామినేషన్ల గడువు ముగియనుంది.

19వ తేదీన నామినేషన్ల పరిశీలన, 22వ తేదీ వరకు నామినేషన్ల ఉప సంహర ణకు గడువు ఇస్తారు. 29వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు.

ఫిబ్రవరి 1వ తేదీన ఫలితాలు వెల్లడిస్తారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-14 13:11:06

Readmore >
Image 1

తిరుమల నిశ్శబ్దంలో భక్తి దీపం : మంజుల పత్తిపాటి

Posted On 2026-06-14 13:07:39

Readmore >
Image 1

షాబాద్‌ ఉన్నత పాఠశాలో సమస్త పూర్వ విద్యార్థుల

Posted On 2026-06-14 13:04:49

Readmore >
Image 1

జనరల్ టికెట్ పై రైల్వే శాఖ హెచ్చరిక

Posted On 2026-06-14 09:20:07

Readmore >
Image 1

కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్

Posted On 2026-06-14 08:30:06

Readmore >
Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >