| Daily భారత్
Logo




పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్యర్యంలో సైకిల్, బైక్ ర్యాలీ

News

Posted on 2025-10-25 10:03:03

Share: Share


పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్యర్యంలో సైకిల్, బైక్ ర్యాలీ

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం 21 అక్టోబర్ 2025 (పోలీసు ఫ్లాగ్ డే) ను పురస్కరిoచుకొని తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలో" సైకిల్ /బైక్ ర్యాలీ" కార్యక్రమాన్ని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్., ఆధ్వర్యంలో నిర్వహించారు.

సైకిల్, బైక్ ర్యాలీ ఉదయం 9:30 గంటలకు పూలాంగ్ చౌరస్తా నుండి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ప్రారంభించారు. పూలాంగ్ చౌరస్తా నుండి ప్రారంభమై దేవి రోడ్డు చౌరస్తా- కోర్టు చౌరస్తా - గ్లామర్ హోటల్ చౌరస్తా - చెన్నైయ్ షాపింగ్ మాల్ చౌరస్తా- ఆర్.టి.సి బస్టాండ్ - ప్రభుత్వ హాస్పటల్- దేవిరోడ్డు చౌరస్తా -గాంధీ చౌక్ చౌరస్తా - నెహ్రూ పార్కు చౌరస్తా వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్  మాట్లాడుతూ ఎందరో పోలీస్ సిబ్బంది ప్రగతి అంతర్గత భద్రత కాపాడటానికి నక్సలైట్లు, మతపరమైన విభజన శక్తులు, ఇతర సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోంటూ నేరాల అరికట్టడం, మాదక ద్రవ్యాల అణచివేయడానికి, మహిళ భద్రతకు ,తమ ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు. వీరి త్యాగాల వల్లనే ఈ రోజు దేశం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా నిజామాబాద్ కమిషనరేటు లో ప్రజల కోసం ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు ఈ నేల చెరగని ముద్ర వేసిందని అన్నారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా చూడాలని, ఎక్కడ ఎలాంటి సంఘటన చోటు చేసుకున్న, వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ మేరకు పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల భాగంగా పోలీసు కుటుంబాలను పరమర్శించినట్లు తెలిపారు. మన పోలీసులు ఒకటే కుటుంబం వారు వేసుకున్న యూనిఫాం అందరికీ గర్వకారణమని వారి త్యాగాల వల్ల నేడు మనం గర్వంగా బతుకుతున్నామని కొనియాడారు. ఈ దేశం కోసం న్యాయం కోసం ,ఎప్పటికీ తలవంచకుండా. పక్షపాతం లేకుండా, సేవా చేయడానికి మన హృదయలతో ప్రమాణం చేద్దామని పేర్కొన్నారు. అదే విధంగా ఈనెల 29 న రక్తదాన శిబిరం ఏర్పాటుచేస్తామని ఇందులో ప్రతీ ఒక్కరు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యాక్రమంలో అదనపు డి.సి.పి (అడ్మిన్ ) బస్వారెడ్డి, అదనపు డి.సి.పి ( ఎ.ఆర్ ) రామ్ చందర్ రావ్, నిజామాబాద్, ట్రాఫిక్ ఎ.సి.పిలు రాజా వెంకట్ రెడ్డి, మస్తాన్ అలీ, సి.ఐలు, రిజర్వు ఇన్స్ పెక్టర్లు, ఎస్.ఐలు, ఆర్.ఎస్.ఐలు, ఆర్మూడ్ రిజర్వు సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది . ఎన్.సి.పి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >