Posted on 2025-10-25 10:33:45
డైలీ భారత్, చందుర్తి: చందుర్తి మండలంలోని సనుగుల గ్రామానికి చెందిన గొట్టే పరిమిళ ఆర్థిక ఇబ్బందులతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని స్థానికులు చెబుతున్నారు. స్థానికుల కథనం ప్రకారం.. గొట్టే పరిమళ(39) దేవుని తండా గ్రామంలో గత 23 సంవత్సరాలుగా అంగన్వాడి ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తుందని తెలిపారు. తనకు కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఉండేవని, ఆరోగ్య సమస్యల నుంచి ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న సమయంలో, ఇలా చేసుకోవడం చాలా బాధాకరంగా ఉన్నదని తన సహచరులు, స్థానికులు తెలిపారు. అలాగే తనకి ఇద్దరు కుమారులు. మొదటి కొడుకు శరత్ కుమార్‌కు 20 సంవత్సరాలు కాగా రెండవ కొడుకు శుసంక్‌కు 14 సంవత్సరాలు. పరిమళ భర్త నరేష్ ఆర్టీసీలో ప్రైవేటు డ్రైవర్‌గా పని చేస్తుండడంతో రోజులాగే ఈరోజు కూడా ఉదయం 6గంటల సమయంలో ఇంట్లో నుండి వెళ్ళాడని, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని చెబుతున్నారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇక పరిమళ ఆత్మహత్య కుటుంబంలో తీరని బాధను మిగిల్చి వెళ్లిపోయిందని స్థానికులు చెబుతున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >