| Daily భారత్
Logo




నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం బైరాపూర్ గ్రామంలో పోడు రైతులను పరామర్శించిన జాగృతి అధ్యక్షురాలు కవిత

News

Posted on 2025-10-26 08:18:47

Share: Share


నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం బైరాపూర్ గ్రామంలో పోడు రైతులను పరామర్శించిన జాగృతి అధ్యక్షురాలు కవిత

జాగృతి జనం బాటలో భాగంగా రెండో రోజు నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం బైరాపూర్ గ్రామంలో పోడు రైతులను పరామర్శించిన జాగృతి అధ్యక్షురాలు కవిత

ఫారెస్ట్ అధికారుల వేధింపులకు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ రైతు రమావత్ ప్రకాష్ కుటుంబాన్ని పరామర్శ

పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్.

రైతులకు పట్టాలు ఇచ్చే వరకు వారి తరఫున పోరాడుతాం

ఆత్మహత్యల ఆలోచనలు వద్దంటూ రైతులకు ధైర్యం చెప్పిన కవిత.

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:తెలంగాణ వచ్చాక మంచిప్ప ప్రాజెక్ట్ పెద్దగా చేసుకోవాలని ప్రయత్నించాం. కానీ అది చేసుకోలేకపోయాం అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఇక్కడకు ప్రచారానికి వచ్చినప్పుడు ఈ ప్రాజెక్ట్ కట్టను అని చెప్పారు.

అలాంటప్పుడు రైతులకు ఈ భూములను పట్టా చేయాలి. ఇవాళ కాకపోతే రేపైనా రైతులకు పట్టా చేయిస్తాం. అని తెలిపారు. ప్రాజెక్ట్ కట్టనప్పుడు ఫారెస్ట్ అధికారులు వచ్చి పోడు రైతులను ఇబ్బంది పెట్టవద్దని నేను ప్రభుత్వాన్ని, ఇక్కడి మంత్రులను, జిల్లా కలెక్టర్ ను కోరుతున్నాని అన్నారు. అదే విధంగా ఇక్కడి 9 తండాలు, 3 గ్రామ పంచాయితీలకు పట్టాలు వచ్చే అవకాశం ఉంది. వాటిని వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాళేశ్వరం కట్టబొమని ప్రభుత్వం స్టాండ్ తీసుకున్నప్పుడు ఇక్కడి పోడు రైతులకు పట్టాలు ఇవ్వాల్సిందే అని అన్నారు. మిగతా పట్టా ల్యాండ్ ల విషయంలో అటవీ శాఖ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించవద్దని అన్నారు. చేతికొచ్చిన పంటపై విషం చల్లటమంటే ఎంత దారుణం? అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత అన్యాయం ఇది? రైతు ఎంత ఆగమైతడు? రైతులను పంట కోసుకొనివ్వచ్చు కదా అని ప్రశ్నించారు. ఇంత నిరంకుశంగా, కర్కషంగా ప్రభుత్వాలు ఉండటం సరైన చర్య కాదన్నారు. ప్రభుత్వాలు ప్రజలను పిల్లల మాదిరిగా చూసుకోవాలని, ఇంత దారుణంగా ఉండటం అన్యాయం అన్నారు. మంచిప్ప చుట్టుపక్కల ఉన్న రైతులను ఫారెస్ట్ వాళ్లు ఇబ్బంది పెట్టకుండా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా ఎమ్మెల్యేలు కూడా రైతులకు అండగా నిలవాలని కోరారు కోరారు. వాళ్లు ఒప్పుకోకపోతే పోరాటం తప్పదని హెచ్చరించారు. ఆత్యహత్య చేసుకునేందుకు ప్రయత్నించిన ప్రకాష్ అలాంటి ఆలోచనలు చేయవద్దని కోరారు. ఆత్మహత్యల వంటి ఆలోచనలు వద్దు. ధైర్యంగా ఉండండి మేమంతా మీకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 30 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నందున అది మీ హక్కు. ప్రభుత్వం నుంచి పట్టాలు ఇప్పించుకుందాం అన్నారు.

Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >