Posted on 2025-10-26 12:47:45
సామాజిక తెలంగాణ సాధన ద్వారానే ఇది సాధ్యం
తెచ్చుకున్న తెలంగాణలో అందరికీ మంచి జరగాలనే జనం బాట
ప్రజల సమస్యలు తీరటం ముఖ్యం. రాజకీయ పార్టీ అవసరమైతే పెడతాం
నిజామాబాద్ లో నన్ను ఎమ్మెల్యేలే ఓడించారు
నన్ను బయటికి పంపి పార్టీ పెట్టించే అవసరం కేసీఆర్ కి లేదు
అలాంటిది ఉంటే మీడియా ముందు ఆయనే చెబుతారు
కేసీఆర్ ని, బీఆర్ఎస్ ను ఇష్యూ బేస్డ్ గానే విమర్శిస్తా
కాంగ్రెస్ ది మునిగిపోయే నావ. వారు నాకు మద్దతు ఇవ్వటమేంటీ?
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:మనం ఎన్నో విప్లవాలను చూశాం. వాటిలో కొన్ని మాత్రమే గమ్యాన్ని ముద్దాడాయి అని అన్నారు. దానిలో స్వేచ్ఛ, సమానత్వం కోసం పోరాడిన ఫ్రెంచ్ ఉద్యమం సక్సెస్ అయ్యింది, నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణ ఉద్యమం సక్సెస్ అయ్యిందన్నారు. జాగృతి జనం బాట ఎందుకంటే? అవకాశం, అధికారం, ఆత్మగౌరవం అనే విధానం మాది. ఇది అర్థం కాని కాన్సెప్ట్ ఏమీ కాదన్నారు. ఇప్పుడు విద్య అందరికీ అందుబాటులో లేదని, ఫీజు రీ యింబర్స్ మెంట్ ఇస్తలేరు. దాంతో నష్టపోయేది ఎవరు?ఆడబిడ్డలు మాత్రమే. ఫీజు కట్టాల్సి వస్తే తల్లితండ్రులు మగ పిల్లలకు ఫీజు ఇస్తారు. ఆడ వాళ్లకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ఈ విధంగా ఆడబిడ్డలకు సీఎం రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. అందరికీ సమాన అవకాశాలు లేకుండా ప్రభుత్వమే అణిచి వేస్తోందన్నారు. అదే విధంగా అధికారంలో వాటా. ఎన్నో సామాజిక వర్గాలు ఉన్నప్పటికీ అధికారంలో వాటా కొన్ని వర్గాలే అనుభవిస్తున్నాయి. అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే సామాజిక న్యాయం జరగాల్సిందేనని స్పష్టం చేశారు. అధికారంలో మహిళల వాటా 5 శాతం కూడా లేదు. కీలక నిర్ణయాలు తీసుకునే స్థానంలో ఎస్సీ, ఎస్టీ, యువత, మహిళలకు భాగస్వామ్యం లేదన్నారు. అన్ని వర్గాలకు భాగస్వామ్యం ఇవ్వాల్సిన అవసరముందన్నారు. మైనార్టీల పేరు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ మైనార్టీ మంత్రి లేని మొట్ట మొదటి కాంగ్రెస్ ప్రభుత్వం అని, మైనార్టీ, ఎస్టీ మంత్రి లేని ప్రభుత్వం. కాంగ్రెస్ సిగ్గుతో తలదించుకోవాలని విమర్శించారు. అందరికీ సమాన అవకాశాలు రావాలంటే అందరినీ కలుపుకొని పోవాలి. ఇక ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ది. తెలంగాణ అంటేనే ఆత్మగౌరవానికి పెట్టింది పేరని, అవకాశం, అధికారం ఉన్నప్పుడు మాత్రమే ఆత్మగౌరవం లభిస్తుందన్నారు. నేను ఒక్క బీసీలు, ఎస్సీ, ఎస్టీల కోసమే మాట్లాడటం లేదని, తెలంగాణలోని అందరి కోసం మాట్లాడుతున్న రిజర్వేషన్లు, అవకాశాలు, ఉపాధి విషయంలో సమానత్వం కోసం ప్రభుత్వాలు ఆలోచించాలన్నారు. గ్రూప్ -1 విషయంలో తెలంగాణ యువతకు అన్యాయం చేసి 8 మంది నాన్ లోకల్స్ కు ఉద్యోగాలు ఇచ్చారు. దీనిపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాశాను. ఆయన సుమోటో గా కేసు విచారణ చేపట్టక పోతే రిట్ పిటిషన్ దాఖలు చేస్తాం అన్నారు. 8 మంది గ్రూప్ -1 స్థాయిలో ఉండి 30 ఏళ్లు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. దాంతో తెలంగాణకు నష్టం జరుగుతుంది. వారందరినీ ఆపే వరకు పోరాటం చేస్తాం. యువతకు జరిగిన నష్టంపై మాట్లాడతా అని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కళాకారులు, ఉద్యమకారులను కలుస్తాం, వాళ్లు పెన్షన్ కావాలని అంటున్నారు. దానికోసం ప్రభుత్వంతో పోరాటం చేస్తానని తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన కళాకారులు, ఉద్యమకారులు కూడా వచ్చి నన్ను కలిశారు. అమరుల కుటుంబాలకు కోటి రూపాయలు ఇవ్వాలి. అదే విధంగా ఉద్యమకారులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తెచ్చుకున్న తెలంగాణ అందరి తెలంగాణ కావాలన్నదే నా కోరిక అని తెలిపారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు ఎందుకు బయటకు వచ్చారో నాకు తెలియదని అన్నారు. నేను బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఎవరైనా ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉంటే వారితో మాట్లాడేదాన్ని. వారిని పార్టీలోనే ఉంచే ప్రయత్నం చేశా అని తెలిపారు. నా విషయంలో పార్టీ ఏకపక్ష నిర్ణయం తీసుకుంది. అసలు నేను బయటకు రావాలని అనుకోలేదని, అనివార్య పరిస్థితుల్లోనే బయటకు వచ్చాను. వారు కాదనుకున్న తర్వాతే పార్టీకి రాజీనామా చేశానని వెల్లడించారు. పార్టీలో ఉండగా మాట్లాడాల్సి అన్ని చోట్ల మాట్లాడాను. కానీ పార్టీకి నష్టం చేసే వారిదే పై చేయి అయ్యిందన్నారు. బీఆర్ఎస్ లో బాధ్యతను మరిచిన మోసపూరిత వ్యక్తులదే పై చేయి అయ్యిందన్నారు. వారి కారణంగా బీఆర్ఎస్, కేసీఆర్ కు నష్టం జరగనుందన్నారు. ఇప్పుడు నా దారి నేను వెతుక్కుంటున్నాను. నాకు తెలియని తెలంగాణ కాదు. నా బాధ ప్రజలకు చెబుతా. వాళ్ల బాధ వింటా. పరిష్కార మార్గానికి ప్రయత్నం చేస్తా అని అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మేము ఎలాంటి స్టాండ్ తీసుకోలేదని, స్థానిక జాగృతి కార్యకర్తలు ఏ పార్టీ ఓటు వేయాలన్నది వారే నిర్ణయం తీసుకుంటారని తేల్చి చెప్పారు. పార్టీ పెట్టుడు పెద్ద పని కాదు. కానీ పార్టీ కన్నా కూడా ప్రజల సమస్యలు తీరటం ముఖ్యం అన్నారు. కేసీఆర్ నాతో పార్టీ పెట్టిస్తున్నారా? అలాంటిది ఏమీ లేదన్నారు. నాకు, కేసీఆర్ కి ఏదీ ఉన్న బయటకు చెప్పే అలవాటు ఉందన్నారు. నాతో పార్టీ పెట్టించాల్సి అవసరం ఆయనకు లేదు. బీఆర్ఎస్ లో జరిగిన ఘటనలు దురదృష్టం. పోరాటాల పార్టీలో ఇలా జరగకూడదని, నా విషయంలో కేసీఆర్ నిర్ణయంతోనే సస్పెండ్ చేసినట్లు తెలిసిందన్నారు. నిజామాబాద్ లో నా ఓటమికి ఎమ్మెల్యేలే కారణమని నేను చాలాసార్లు చెప్పాను. ఒక పార్టీలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. ఐదేళ్ల క్రితమే ఎవరి పనితీరు ఏంటీ? అని తెలుసుకొని ఉంటే మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయేది కాదన్నారు. ఓటమి తర్వాత బీఆర్ఎస్ పెట్టిన రివ్యూ మీటింగ్ లలో చాలా మంది అదే చెప్పారన్నారు. నేను బీఆర్ఎస్ లో తిరుగుబాటు చేయలేదని, అంత అవకాశం ఇవ్వకుండానే నన్ను బయటకు పంపారన్నారు. కాంగ్రెస్ వాళ్లు నాకు మద్దతు తెలుపుతున్నారన్న దాంట్లో వాస్తవం లేదన్నారు. కాంగ్రెస్ కే ప్రజల నుంచే దిక్కు లేదు. నాకు వాళ్లు ఏమీ సపోర్ట్ చేస్తారు. మునిగిపోయే నావ కాంగ్రెస్ అని, వాళ్లతో నాకేం పని. నాకు చాలా మంది మద్దతు ఉందని ధీమా వ్యక్తం చేశారు వ్యక్తం చేశారుఅనుకోకుండా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్... ఆ అధికారాన్ని కాపాడుకోలేకపోతోందన్నారు. ప్రజల్లో ఆ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందన్నారు.
కేసీఆర్ కచ్చితంగా మంచి సీఎం, మంచి నాయకుడు. కానీ కొంతమంది కారణంగా ఆయనకు చెడ్డ పేరు వస్తోందన్నారు.
బీఆర్ఎస్ ను గానీ, కేసీఆర్ ని గానీ ఇష్యూ బేస్డ్ గా మాత్రమే విమర్శిస్తా అని అన్నారు. లోకల్ బాడీ ఎన్నికలు వచ్చినప్పుడు ఏం చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటాం అన్నారు. ఇక్కడున్న బీజేపీ ఎంపీ ఉన్న లేనట్లే అని, గతంలో మాధవ నగర్ బ్రిడ్జి గురించి చాలా మాట్లాడారు. ఇప్పుడు రెండేళ్లు అయిన సరే బ్రిడ్జి పనుల్లో ఏమాత్రం పురోగతి లేదన్నారు. గతంలో కే ట్యాక్స్ నడుస్తుందని ఆరోపణలు చేశారు. మరి ఇప్పుడు మీ ట్యాక్స్ నడుస్తుందా? ఎంపీకి చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి లేదా మోడీ తో మాట్లాడి బ్రిడ్జి పనులు పూర్తి చేయించాలన్నారు. బీసీలకు రిజర్వేషన్ బిల్లు విషయంలో అర్వింద్ రాజీనామా చేయాలన్నారు.అప్పుడు బిల్లు నడుచుకుంటూ వస్తుంది. మీరు బీసీలకు ఆరాధ్య దైవంగా మిగిలి పోతారన్నారు. కేంద్రంలో మోడీ సర్కార్ మైనార్టీ లో ఉంది. మీరు రిజైన్ చేస్తే బిల్లు కచ్చితంగా అవుతుందన్నారు. నేను జనం బాటకు వస్తున్నానని తెలిసి మరో బీజేపీ ఎంపీ నా గురించి ఇష్టానుసారంగా మాట్లాడారు ఆయన అవినీతికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే బయటపెడతా అని స్పష్టం చేశారు. మంచిప్ప ప్రాజెక్ట్ ను కట్టబోమని రేవంత్ రెడ్డి చెప్పాడు. అక్కడి పోడు రైతులకు పట్టాలు ఇస్తా అన్నాడు. కానీ చేతికొచ్చిన పంటను విషం చల్లి పాడు చేశారు. దీంతో ఒక రైతు అదే విషంతో ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. మూడు ఎకరాల్లో పంట వేసిన ఆ రైతుకు ఎంత పెట్టుబడి అయ్యి ఉంటుందని ప్రశ్నించారు. పోడు రైతుల విషయంలో ఫారెస్ట్ ఆఫీసర్లు సంయమనం పాటించాలని కలెక్టర్ ఆ అధికారులకు చెప్పాలన్నారు.
మంచిప్ప ప్రాజెక్ట్ కట్టకపోతే అక్కడి రైతులకు వ్యవసాయం చేసే అవకాశం ఇవ్వండని అన్నారు. గోదావరి వరద ముంపు ప్రాంతమైన యంచ అనే గ్రామంలో పొలాలను పరిశీలించానని తెలిపారు. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రైతులు చాలా నష్టపోయారు. అందరూ మాజీ మంత్రులు సుదర్శన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, మంత్రి తుమ్మల సహా కలెక్టర్ ది తప్పు అంటున్నారు. ఇది రాజకీయాలకు సమయం కాదని. రైతులకు అండగా ఉండాల్సిన సమయం అని అన్నారు. నవీపేట మండలంలోనే 5 వేల ఎకరాల నష్టం జరిగిందన్నారు. ఒక్కో ఎకరాకు రూ. 50 వేలు నష్ట పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మక్క రైతులకు 400 బోనస్ అన్నారు. దాదాపు 70 వేల ఎకరాల్లో మక్కా రెతులకు నష్టం జరిగిందన్నారు. ఇప్పటి వరకు కాంటాలు పెట్టలేదు. వారంతా రూ. 1700 లకే క్వింటాల్ అమ్మేశారని అన్నారు. మీ పట్టి లేని తనం వల్ల ఒక్కో మక్కా రైతుకు క్వింటాకు రూ. 700 నష్టం జరిగిందన్నారు. వరి విషయంలోనూ ఈ ఆక్షేపించారు ప్రభుత్వం ఇలాగే చేసిందని ఆక్షేపించారు. ఇప్పటికీ చాలా చోట్ల ధాన్యం తడిసి, బూజు పట్టి ఉందన్నారు. ఈ ప్రభుత్వం రైతులకు నష్టం లేకుండా కచ్చితంగా చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గతేడాది బోనస్ తో కలిపి ఈ ఏడాదిది కూడా ఇవ్వాలన్నారు. ఎన్నికలకు ముందు ఏ రకం అయినా సరే బోనస్ ఇస్తాం అన్నారు. కానీ తర్వాత మాట మార్చారు. కనీసం సన్న రకం ధాన్యానికైన సరిగా బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో బీడీ కంపెనీ వాళ్లు కోత పెట్టటంతో మహిళలకు నష్టం జరుగుతోందన్నారు. అన్ని బీడీ కంపెనీల వాళ్లు కోత పెడుతున్నారు. దీనిపై జిల్లాకు చెందిన కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు కొట్లాడాలన్నారు. నిన్నటి నుంచి నిజామాబాద్ లో ఉన్నా. జనం బాట కార్యక్రమానికి వచ్చిన నాకు ఘన స్వాగతం పలికారు. నిజామాబాద్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >