| Daily భారత్
Logo




రేబిస్ వ్యాధితో నెలరోజుల తర్వాత మృతిచెందిన చిన్నారి

News

Posted on 2025-10-26 13:31:02

Share: Share


రేబిస్ వ్యాధితో నెలరోజుల తర్వాత మృతిచెందిన చిన్నారి

నిజామాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన విషాద ఘటన

కుక్క కరిచిన విషయం కుటుంబ సభ్యులకు చెప్పని చిన్నారి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గడ్డం లక్ష్మణ అనే 10 ఏళ్ల బాలిక కుక్క కాటుకు గురైన నెల రోజుల తర్వాత రేబిస్  వ్యాధితో మరణించింది. భయంకరమైన ఈ వ్యాధి గురించి తెలియక.. కుక్క కరిచిన విషయాన్ని దాచిపెట్టడం వల్లే బాలిక ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు తెలిపారు. లక్ష్మణను దాదాపు నెల రోజుల క్రితం ఒక కుక్క కరిచింది. ఈ దాడిలో ఆమె తలకు గాయమైంది. అయితే.. ఈ విషయం తల్లిదండ్రులకు చెబితే వారు మందలిస్తారేమోనని భయపడి.. బాలిక ఈ సంఘటన గురించి ఇంట్లో ఎవరికీ చెప్పలేదు.

మూడు రోజుల క్రితం లక్ష్మణ ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పు వచ్చింది. ఆమె కుక్కలా మొరగడం వంటి అసాధారణంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. పరిస్థితి చేయి దాటిపోవడంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు వెంటనే బాలికను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆలస్యం కావడంతో బాలిక రేబిస్ వ్యాధికి పూర్తిగా లోనైందని వైద్యులు నిర్ధారించారు. చికిత్స పొందుతూ లక్ష్మణ మరణించింది. ఈ విషాద ఘటన నేపథ్యంలో వైద్యులు ప్రజలను అప్రమత్తం చేశారు. కుక్క కాటు అనేది చిన్న గాయంగా కనిపించినా.. అది రేబిస్ వంటి ప్రాణాంతక వ్యాధికి దారితీసే ప్రమాదం ఉంది. కుక్క కరిచిన వెంటనే.. అది పెంపుడు కుక్క అయినా, వీధి కుక్క అయినా సరే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే రేబిస్ టీకా తీసుకోవాలని వైద్యులు గట్టిగా సలహా ఇస్తున్నారు. కుటుంబ సభ్యులకు తెలియకుండా చిన్న పిల్లలు కుక్క కాటును దాచిపెట్టే ప్రమాదం ఉన్నందున.. తల్లిదండ్రులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, పిల్లలకు రేబిస్ ప్రమాదం గురించి అవగాహన కల్పించాలని కోరారు. సకాలంలో సరైన చికిత్స తీసుకుంటే రేబిస్ను నివారించవచ్చని వైద్యులు స్పష్టం చేశారు.

Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >