| Daily భారత్
Logo




ఘోర రోడ్డు ప్ర‌మాదం

News

Posted on 2024-01-07 11:18:50

Share: Share


ఘోర రోడ్డు ప్ర‌మాదం

డైలీ భారత్, నెల్లూరు జిల్లా:నెల్లూరులో ఆదివారం తెల్ల‌వారు జామునా ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. టీఎస్ ఆర్టీసీ బస్సు లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో సహా మరొకరు మృతి చెందారు.

బ‌స్సులో ప్ర‌యాణీస్తున్న 10 మందికి గాయాలు అయ్యాయి.సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన వారిని కావలి ఆస్పత్రికి తరలించారు. గుడ్లూరు మండలం మోచర్ల వద్ద జాతీయ రహదారిపై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.తెలంగాణ ఆర్టీసీకి చెందిన టీఎస్ 05 జెడ్ 0249 నంబర్ బస్సు మిర్యాలగూడ నుంచి తిరుపతికి వెళ్తున్న క్రమంలో గుడ్లూరు మండలం మోచర్ల దగ్గర జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారు జామున ధాన్యం లోడుతో వెళుతున్న లారీని టీఎస్ ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది.

ప్రమాద స్థలంలోనే డ్రైవర్ వినోద్ అక్కడికక్కడే మృతి చెందాడు. 10 మందికి గాయాలు కాగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని నెల్లూరు అపోలో ఆస్పత్రికి తరలించారు. నెల్లూరుకు వెళ్తుండగా సీత అనే మహిళ మృతి చెందింది.

గాయాలు అయిన కొందరిని కావలి ఏరియా ఆస్పత్రికి, ఇంకొందరిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ డ్రైవర్ వినోద్ నిద్రమత్తులో ఉండగా ఈ ఘటన జరిగిందని గుడ్లూరు పోలీసులు అనుమానిస్తు న్నారు.

డ్రైవర్ వినోద్ మృత దేహాన్ని కందుకూరు ఏరి యా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమా దంపై గుడ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నారు....

Image 1

అర్ధరాత్రి రైలులో దొంగల బీభత్సం..

Posted On 2026-06-15 09:51:53

Readmore >
Image 1

మెట్‌పల్లి తహసీల్దార్ సంతకం ఫోర్జరీ కేసులో నలుగురు అరెస్ట్

Posted On 2026-06-15 09:46:59

Readmore >
Image 1

రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.1,00,116 విరాళం అందజేసిన దంపతులు

Posted On 2026-06-15 06:56:34

Readmore >
Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >