Posted on 2025-10-27 14:17:58
పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు నిరంతరం గమనించాలి
పోషణ మాసం ముగింపు వేడుకల్లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్
కరీంనగర్ జిల్లా అధికారుల పనితీరు బాగుందని ప్రశంసలు
డైలీ భారత్, కరీంనగర్:నాణ్యమైన విద్య, పోషకాహారం అందించడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రజలకు పోషకాహారం ప్రాధాన్యతపై మరింత అవగాహన కల్పించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్.. అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కళాభారతి లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ మాసం ముగింపు వేడుకలు నిర్వహించగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉండి పిల్లలు పోషకాహార లోపం బారిన పడకుండా చూసుకోవాలన్నారు. ఇందుకు తగ్గట్లు మనం తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాలన్నారు. బాల్యంలో పోషకాహార లోపం అధిగమిస్తే చిన్నారులు శారీరకంగా మానసికంగా దృఢంగా మారుతారని పేర్కొన్నారు.
ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే కేంద్రం 21 వేల కోట్లు చిన్నారుల సంక్షేమానికి కేటాయించినట్లు వివరించారు. జిల్లాలో 52,000 మంది లబ్ధి పొందినట్లు పేర్కొన్నారు.
చిన్నారుల సంక్షేమం, విద్య, వైద్యానికి జిల్లా కలెక్టర్ అధిక ప్రాధాన్యతనిస్తున్నారని ప్రశంసించారు. నివేదికల ప్రకారం సంబంధిత శాఖ అధికారుల పనితీరుతో రాష్ట్రంలోనే మన జిల్లా ముందువరుసలో ఉందన్నారు. అవగాహన లేకనే అనారోగ్య సమస్యలు వస్తాయని.. ప్రతి ఒక్కరూ పోషకాహారం పై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరూ రోజు ఏదో ఒక టాబ్లెట్ వేసుకుంటున్నారని, ఇది తగ్గాలని ఆకాంక్షించారు.
అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్ నిధులు అందిస్తానని ప్రకటించారు.
పిల్లలు ఏం చేస్తున్నారో గమనించాలి
యువత, విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ కు బానిసలవుతున్నారని
మన పిల్లలు ఏం చేస్తున్నారు.. ఎవరిని కలుస్తున్నారు.. ఏం తింటున్నారు ఇలా వారి ప్రవర్తన పై నిరంతరం గమనించాలని కేంద్రమంత్రి తల్లిదండ్రులకు సూచించారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం కేంద్ర ప్రభుత్వం నషాముక్తుభారత్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు. డ్రగ్స్ గురించి తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.
20వేల మందికి సైకిళ్ళు ఇచ్చాం
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ప్రభుత్వ బడుల్లో పదో తరగతి చదివే బాల బాలికలకు సైకిళ్ళు అందించినట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం వైద్యానికి పెద్దపీట వేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులతోనే సర్కారు ఆసుపత్రుల్లో ఎక్స్ రే మిషన్లు, తదితర అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆయుష్మాన్ భారత్ కార్డు కింద ఐదు లక్షల రూపాయల వరకు వైద్యం పొందవచ్చన్నారు.
అంగన్వాడీ సిబ్బంది అందిస్తున్న సేవలను కేంద్ర మంత్రి ప్రశంసించారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ...
ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం జబ్బుల దారిన పడకుండా ఎలాంటి ఆహారం తీసుకోవాలో వివరించడమన్నారు.
ప్రస్తుత సమాజంలో చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని.. జిల్లాలో వారి సంఖ్య తగ్గించాలని సిబ్బందికి సూచించారు.
ఐదేళ్ల వరకు 90 శాతం మెదడు ఎదుగుతుందని.. ఈలోగా చిన్నారులు పోషకాహార లోపం బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత పేరెంట్స్ దేనని పేర్కొన్నారు.
తల్లిదండ్రులు తప్పనిసరిగా సమీపంలోని అంగన్వాడి కేంద్రానికి వెళ్లి పోషకాహారం గురించి తెలుసుకోవాలని సూచించారు.
నగర పాలక సంస్థ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ మాట్లాడుతూ...
న్యూట్రిషన్ ఫుడ్, హెల్త్ పై అవగాహన కల్పించేందుకు పలు పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం మాత్రమే తీసుకోవాలన్నారు.
మన ప్లేట్లు లో ప్రోటీన్లు, విటమిన్లు ఫైబర్ తో కూడిన ఆహారం ఉండేలా చూసుకోవాలన్నారు.
మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దని.. ఇంట్లో అందరూ కలిసి తినాలన్నారు.
అనారోగ్యానికి గురైతే ప్రభుత్వాసుపత్రులకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి మాట్లాడుతూ..
పోషణ మాసోత్సవంలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలను వివరించారు.
నషా ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా చేపట్టిన రంగోలి పోటీలు, పోస్టర్ మేకింగ్ వాల్ పెయింటింగ్, కాన్షియస్ క్లబ్ ద్వారా సహాయక సంఘాల సభ్యులతో కలిసి చేపట్టిన కార్యక్రమాలను వివరించారు.
ఈ సందర్భంగా ఆవరణలో ఏర్పాటుచేసిన పోషకాహారం స్టాళ్లను కేంద్ర మంత్రి పరిశీలించారు.
అనంతరం అన్నప్రాసన, సీమంతం కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం పోషకాహారం ప్రతిజ్ఞ, నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రతిజ్ఞ చేశారు.
అనంతరం వంటల పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి, పాల్గొన్న వారికి బహుమతులు అందించారు.
కార్యక్రమంలో జడ్పీ సీఈఓ శ్రీనివాస్, డిఎంహెచ్ఓ వెంకటరమణ, సిడిపివోలు, ఐసీడీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >