Posted on 2025-10-27 14:25:20
మైనర్లకు లిక్కర్ విక్రయించవద్దు
నిబంధనల మేరకు దుకాణాలు నిర్వహించాలి
ఇంచార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్
ఐడీఓసీలో A4 మద్యం దుకాణాల టెండర్ లక్కీ డ్రా
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: మద్యం దుకాణాల టెండర్ లక్కీ డ్రా పారదర్శకంగా నిర్వహించామని ఇంచార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ స్పష్టం చేశారు.
జిల్లాలో 2025- 2027 సంవత్సరం వరకు కొనసాగనున్న మద్యం షాపుల టెండర్ల ఓపెన్ డ్రా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించగా, ఇంచార్జి కలెక్టర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. జిల్లాలో మొత్తం 48 దుకాణాలు ఉన్నాయని, వాటిలో గౌడ్లకు 9, ఎస్సీ లకు 5 రిజర్వేషన్ ప్రకారం కేటాయించామని వెల్లడించారు. సెప్టెంబర్ 26వ తేదీన టెండర్ నోటిఫికేషన్, అప్లికేషన్లు స్వీకరణ మొదలుపెట్టామని, దరఖాస్తులు ఈ నెల(అక్టోబర్) 23వ తేదీ వరకు స్వీకరించామని తెలిపారు. మొత్తం దరఖాస్తులు 1381 వచ్చాయని వెల్లడించారు.
డిసెంబర్ 01 వ తేదీ నుంచి నూతన లైసెన్సులతో మద్యం దుకాణాలు కొనసాగనున్నాయని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం దుకాణాలు నిర్వహించాలని ఆదేశించారు. షాపులకు సంబంధించిన లైసెన్స్ ఫీజు చెల్లించాలని సూచించారు.
కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ అధికారి రాధాకృష్ణారెడ్డి, ఎక్సైజ్ సీఐలు శ్రీనివాస్, రాజేశ్వర్ రావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >