| Daily భారత్
Logo




తెలంగాణ హైకోర్టు వెబ్ సైట్ హ్యాక్

News

Posted on 2025-11-15 10:02:56

Share: Share


తెలంగాణ హైకోర్టు వెబ్ సైట్ హ్యాక్

డైలీ భారత్, హైదరాబాద్:తెలంగాణలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర హైకోర్టు వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌కు గురైంది. కోర్టు వెబ్‌సైట్‌ నుంచి ఆర్డర్‌ కాపీలు డౌన్‌లోడ్ చేస్తుండగా అంతరాయం ఏర్పడింది. అదే సమయంలో హైకోర్టు వెబ్‌సైట్‌లో బెట్టింగ్‌ సైట్‌ ప్రత్యక్షమైంది. ఇది చూసిన అధికారులు షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

తెలంగాణ హైకోర్టు వెబ్సైటు మొత్తాన్ని బిఆర్కే భవన్ లో ఉన్న నేషనల్ ఇన్ఫర్మేటివ్ సెంటర్ నడిపిస్తుంది. NIC ద్వారానే తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ కార్యకలాపాలు చూసుకుంటుంది. ఈ తరుణంలో కాస్ లిస్టు తో పాటు ఆర్డర్ కాపీలు సంబంధిత డాక్యుమెంట్లను పిడిఎఫ్ ఫార్మాట్లో వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. ఇలా అప్లోడ్ చేసిన ఫైల్స్ ను డౌన్లోడ్ చేసే క్రమంలో కొంతమంది యూజర్లకు పిడిఎఫ్ ఫైల్ కు బదులుగా ఆన్లైన్ బెట్టింగ్ సైట్ ఓపెన్ అయింది

దీని గమనించిన యూజర్లు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ప్రతిష్టాత్మకంగా ఉండే హైకోర్టు వెబ్సైటును ఎవరో హ్యాక్ చేసినట్లు ఐటి రిజిస్టర్ గుర్తించారు. వెంటనే NIC సర్వర్ ప్రతినిధులకు ఈ విషయాన్ని చేరవేశారు. వారు సైతం దీనిపై విచారణ చేపడుతున్నారు. మరోవైపు జరిగిన ఉదాంతం పై తెలంగాణ రాష్ట్ర డిజిపి కి హైకోర్టు ఐటి రిజిస్టర్ ఫిర్యాదు చేశారు. డిజిపి సిఫార్సుతో హైదరాబాద్ ఛాబర్ క్రైమ్ పోలీసులు దీనిమీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తెలంగాణ హైకోర్టు వెబ్సైటును న్యాయవాదులతో పాటు అనేకమంది ప్రజలు సైతం దీనిని ఉపయోగిస్తుంటారు. వారి కేసులకు సంబంధించిన విషయాలు ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేసుకోవడానికి తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ TSHC కి వెళ్లి ఫైల్స్ డౌన్లోడ్ చేస్తుంటారు. ఈ క్రమంలో నే ఆన్లైన్ బెట్టింగ్ సైట్ ప్రత్యక్షమవడంతో అవాకైనా యూజర్లు అధికారులను అలర్ట్ చేశారు.

Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >