| Daily భారత్
Logo




కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ ఉత్తమ మార్గం : జిల్లా ప్రధాన న్యాయమూర్తి కర్ణ కుమార్

News

Posted on 2025-11-15 19:47:35

Share: Share


కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ ఉత్తమ మార్గం : జిల్లా ప్రధాన న్యాయమూర్తి కర్ణ కుమార్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ ఉత్తమ మార్గం అని రంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి,జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్మన్ కర్ణ కుమార్ అన్నారు.రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు  రంగారెడ్డి జిల్లాలో గల అన్ని కోర్ట్ ప్రాంగణాలలో శనివారం స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ స్పెషల్ లోకాదాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ లోకదాలత్ లో సెటిల్ చేసుకోవడం ద్వారా తాము సివిల్ కేసులలో చెల్లించిన కోర్ట్ ఫీస్ కూడా తిరిగి పొందొచ్చు అని చెప్పారు. తమ కేసులను అనగా ఆస్తి పరమైన కేసులు మరియు కుటుంబ సమస్యల కేసులు పరిష్కారం చేసుకోవడానికి ఈ లోక్ అదాలత్ మరియు మధ్యవర్తిత్వం  ఒక మంచి వేదిక అని చెప్పారు. లోక్ అదాలత్ లో కేసు రాజీ అవ్వడం ద్వారా ఇరు వర్గాలు గెలిచినట్టే అని అన్నారు.జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి హనుమంత రావు మాట్లాడుతూ రంగా రెడ్డి జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్ట్ ప్రాంగణాలలో 20 లోక్ అదాలత్ బెంచిలు ఏర్పాటు చేశామని ఇందులో రాజీకి ఆమోద యోగ్యమైన క్రిమినల్ కేసులు ,సివిల్ దావాలు, చెక్ బౌన్స్ కేసులు, మోటారు వాహన ప్రమాద బీమా కేసులు, కన్జ్యూమర్ కోర్టు కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులు పరిష్కరించుకొన్నారు అని చెప్పారు. ఈ లోక్ అదాలత్ నిర్వహించుటలో పోలీస్ వారు, ఇన్సూరెన్స్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, పానెల్ అడ్వొకేట్స్ మరియు జిల్లా న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది తమవంతు సహాయసహకారాలను అందించారు కక్షిదారులు సంతోషం వ్యక్త పరిచారు.ఇందులో క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, మోటార్ వాహన ప్రమాదభీమా కేసులు, బ్యాంకు రికవరీ మరియు ప్రీలిటిగేషన్ కేసులు అన్ని కలిపి సుమారు 2050 పైచిలుకు కేసులు పరిష్కరించబడ్డాయి. అలాగే అన్ని కేసులలో కలిపి రూ.1,33,80,000/- రూపాయల వరకు నష్ట పరిహారాన్ని కక్షిదారులకు ఇప్పించడం జరిగింది.

Image 1

ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS

Posted On 2026-06-19 21:55:09

Readmore >
Image 1

నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం

Posted On 2026-06-19 20:54:23

Readmore >
Image 1

గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-06-19 20:36:40

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్‌ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్‌

Posted On 2026-06-19 20:33:12

Readmore >
Image 1

రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం

Posted On 2026-06-19 19:17:58

Readmore >
Image 1

భూవివాదాలు లేని తెలంగాణ నిర్మాణ‌మే లక్ష్యం

Posted On 2026-06-19 19:13:38

Readmore >
Image 1

గాంధీ సరోవర్‌ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్

Posted On 2026-06-19 19:11:46

Readmore >
Image 1

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీవీఎంసీ ఉద్యోగి

Posted On 2026-06-19 19:00:24

Readmore >
Image 1

దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-06-19 17:52:08

Readmore >
Image 1

ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం

Posted On 2026-06-19 16:50:47

Readmore >