Posted on 2025-11-22 19:58:37
డైలీ భారత్ న్యూస్, ఖమ్మం:ఖమ్మం జిల్లామోడిఫైడ్ సైలెన్సర్లు అమర్చిన బుల్లెట్ వాహనాల సైలెన్సర్లను తొలగించి, జరిమానా విధించినట్లు ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు తెలిపారుపోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు ఖమ్మం నగరంలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో మోడిఫైడ్ సైలెన్సర్లతో నడిపే బుల్లెట్ వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.కొందరు యువకులు వాహనాలకు సంబంధిత సంస్థ ఇచ్చిన సైలెన్సర్లను మార్పుచేసి వింత శబ్దం, అగ్ని మంట వచ్చే వాటిని అమర్చి, రోడ్లపై అకస్మాత్తుగా వింత శబ్దాలు చేయడం, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతున్న నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. *అందులో భాగంగా ఈరోజు 20 మోడిఫైడ్ సైలెన్సర్ల వరకూ తొలగించి ఒక్కో వాహనదారుడికి రూ.1,000 జరిమానా విధించారమని తెలిపారు. ఇప్పటికే సుమారు1000 మోడిఫైడ్ సైలెన్సర్ల వరకు తొలగించడం జరిగిందని తెలిపారుకార్యక్రమంలో ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఆర్ఐ అప్పలనాయుడు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >