| Daily భారత్
Logo




బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పేరిట కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న పొలిటికల్ డ్రామా

News

Posted on 2025-11-27 13:56:51

Share: Share


బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పేరిట కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న పొలిటికల్ డ్రామా

చదువుకునే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం..సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్ పదవులకు రిజర్వేషన్ ఇస్తుందా

నిజామాబాద్ ఎంపీ అరవింద్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:42 శాతం బీసీ రిజర్వేషన్లు కాంగ్రెస్ ఆడుతున్న పొలిటికల్ డ్రామా అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ రాష్ట్రప్రభుత్వంపై విమర్శించారు. గురువారం బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సదువుకునేటోళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికల్లో బీసీలకు సర్పంచ్ పదవుల కోసం రిజర్వేషన్లు ఇస్తదా అని ప్రశ్నించారు.

ఇక జిల్లాలో ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న ఆర్వోబీలకు రాష్ట్ర ప్రభుత్వం 13.5 కోట్లు విడుదల చేసినందుకు ప్రత్యేకంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు  ధన్యవాదాలు తెలిపారు.

 విడుదల అయిన నిధులతో రాష్ట్ర సర్కార్  ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా యుద్ద ప్రాతిపదికన ఆర్ఓబి పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.

అలాగే అర్సపల్లి ఆర్వోబి పనులకు  రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ తొందరగా చేయించాలన్నారు. బోధన్ నియోజకవర్గంలో ఆర్వోబీ పెండింగ్ ఉందని, దీనిపై ప్రభుత్వ సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వీటిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ సర్కార్ ప్రస్తుతం 17 శాతమే రిజిస్ట్రేషన్లు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ దొంగనాటకం బయటపడిందని దుయ్యబట్టారు. కేవలం కేంద్ర నిధుల కోసమే పంచాయతీ ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని, మరి ప్రభుత్వం ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎన్నికలు ఎందుకు పెట్టడం లేదన్నారు. కాంగ్రెస్ గుర్తుతో పోలింగ్ జరిగితే కాంగ్రెస్ ను ప్రజలు

చీత్కరిస్తరని ఎన్నికలు పెట్టడం లేదని విమర్శించారు. అలాగే ఈ సర్పంచ్ ఎన్నికల ఓట్ల కోసమే మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని విమర్శించారు. మీడియా సమావేశంలో నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి పటేల్ మాజీ కార్పొరేటర్లు, పార్టీ సీనియర్ నేతలు తదితరులు పాల్గొన్నారు.

Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 21:54:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 08:04:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 19:39:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 19:32:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 19:30:41

Readmore >
Image 1

కాలినడక ద్వారా తిరుమలకు చేరిన 116 ఏళ్ల వృద్ధురాలు

Posted On 2026-07-05 17:09:50

Readmore >
Image 1

ఒవైసీ కాలేజ్ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్!!

Posted On 2026-07-05 17:08:44

Readmore >
Image 1

ఏలూరు జిల్లాలో విషాదం... రైలు ఢీకొని నలుగురి మృతి

Posted On 2026-07-05 11:44:43

Readmore >
Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >