Posted on 2025-11-27 14:30:09
హడావిడి చేసే నాయకుడు కాదు, ప్రజా నాయకుడు: సీతాలక్ష్మి
డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవన్న ఎన్నికల నేపథ్యంలో కొత్తగూడెంలో మున్నూరు కాపు సంఘం పేరుతో హడావిడి చేస్తున్నారని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు విమర్శలు చేయడం సరికాదని కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి అన్నారు. హడావిడి చేసే నాయకుడు ఆయన కాదని, ప్రజా నాయకుడని ఎవరికి ఏ అవసరం వచ్చినా నేనున్నాను అనే నాయకుడు వద్దిరాజు రవి చంద్ర అని అన్నారు. కుల మతంతో ఎటువంటి సంబంధం లేకుండా ఎవరు అవసరం ఉంది అన్న తీర్చే నాయకుడని అన్నాడు.
స్థానిక కాపు సంఘ పెద్దల ఆహ్వానం మేరకే మున్నూరు కాపు భవనాన్ని సందర్శించారని గుర్తు చేశారు. భవన నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పారు.
బీసీలను 42% రిజర్వేషన్ పేరుతో నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఉన్న రిజర్వేషన్ ఇచ్చే పరిస్థితులలో కూడా లేని ప్రభుత్వం. కాంగ్రెస్ వైపే బీసీ ఉప కులాలు ఉన్నాయని చెప్పడం సిగ్గుచేటు అన్నారు.
రాజకీయ లబ్ధి పొందడం కోసం ఎవరు తహతహలాడుతున్నారో ప్రజలకు అర్థమైందని రెండు సంవత్సరాలైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని మరిచిందని అన్నారు. విమర్శలు చేసే ముందు ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల ఇన్చార్జిగా, రాజ్యసభ సభ్యుడు జిల్లాలో పర్యటిస్తే ఎందుకంత భయమని సీతాలక్ష్మి ప్రశ్నించారు.
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >