| Daily భారత్
Logo




త్వరలో తెలంగాణ రాష్ట్రంలో పేద రెడ్ల కోసం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు

News

Posted on 2025-11-28 17:45:53

Share: Share


త్వరలో తెలంగాణ రాష్ట్రంలో పేద రెడ్ల కోసం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి తో రెడ్డి సంఘాల ప్రతినిధుల చర్చలు

రెడ్ది ఐక్యవేదికస్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి

డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: గత పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రెడ్డి సంఘాల ఆధ్వర్యంలో పేద రెడ్డి సామాజిక వర్గం కోసం జరుగుతున్న పోరాటం వారి హక్కుల కోసం చేస్తున్న ఉద్యమ ఫలితం త్వరలో తెలంగాణ రాష్ట్రంలో పేద రెడ్ల కోసం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

 తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలుమార్లు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకి జానా రెడ్డి సుదర్శన్ రెడ్డి,కిప్రభుత్వ సలహాదారులు నరేందర్ రెడ్డిలకు కి పలు మార్లు విన్నవించడం జరిగిందన్నారు.

 తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు చాలామంది పేదరికంలో ఉన్నారు. ఆయా వర్గాలకు ప్రభుత్వం నుండి కావచ్చు వారికి ప్రత్యేక కార్పొరేషన్ గాని ఏర్పాట చేసి ఆ వర్గాలకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందుతున్నాయి.  కానీ ఇప్పటివరకు ఉన్న ప్రభుత్వాలు అగ్రవర్ణాల పేదలకు ఎటువంటి సాయ సహకారాలు అందించలేదని, రెడ్డి సంఘాల ఆధ్వర్యంలో పేద రెడ్ల కోసం చాలా కార్యక్రమాలు బహిరంగ సభలు ధర్నాలు ముట్టడి కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. అన్ని వర్గాల మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద రెడ్ల కు ప్రభుత్వం నుండి ప్రతిఫలాలు అందాలని మేము చాలా సార్లు విన్నవించడం జరిగిందన్నారు.

 తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అధికారం చేపట్టిన వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మాట ఇవ్వడం జరిగింది . ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే చట్టబద్ధతతో కూడిన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ పాలక వర్గాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.

 రానున్న రోజుల్లో తెలంగాణలో రాష్ట్రంలో ఉన్నటువంటి పేద రెడ్డి సామాజిక వర్గంలోని నిరుద్యోగ యువతీ యువకులు, వ్యవసాయ ఆధారిత కుటుంబాలు దీని ద్వారా రుణాలు పొంది ఆర్థికంగా స్థిరపడే విధంగా కార్పొరేషన్ ద్వారా నిధులు కేటాయించబడతాయని ఈ సందర్భంగా రెడ్డి ఐక్యవేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి అన్నారు.

 ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తొందరలోనే  కార్పొరేషన్ ఏర్పాటు చేసి మా పేద వర్గాల ఆర్థిక ఇబ్బందులను తొలగించాలని ఈ సందర్భంగా వారిని కోరారు.

ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక స్టేట్ ప్రెసిడెంట్ ఏనుగు సంతోష్ రెడ్డి, యూత్ ప్రెసిడెంట్ ఎలిమినేటి సుమన్ రెడ్డి జేఏసీ చైర్మన్ బద్రు వెంకటేశ్వరరెడ్డి, రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోపి జైపాల్ రెడ్డి, రాష్ట్ర నాయకులు సంజీవరెడ్డి రాజ్ కుమార్ రెడ్డి దయాకర్ రెడ్డి,  తదితరులు పాల్గొన్నారు.


Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 21:54:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 08:04:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 19:39:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 19:32:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 19:30:41

Readmore >
Image 1

కాలినడక ద్వారా తిరుమలకు చేరిన 116 ఏళ్ల వృద్ధురాలు

Posted On 2026-07-05 17:09:50

Readmore >
Image 1

ఒవైసీ కాలేజ్ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్!!

Posted On 2026-07-05 17:08:44

Readmore >
Image 1

ఏలూరు జిల్లాలో విషాదం... రైలు ఢీకొని నలుగురి మృతి

Posted On 2026-07-05 11:44:43

Readmore >
Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >