| Daily భారత్
Logo




దీక్షాదివస్ కు ముస్తాబైన నిజామాబాద్ బీ ఆర్ఎస్ జిల్లా కార్యాలయం

News

Posted on 2025-11-28 20:53:39

Share: Share


దీక్షాదివస్ కు ముస్తాబైన నిజామాబాద్ బీ ఆర్ఎస్ జిల్లా కార్యాలయం

పెద్ద ఎత్తున నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు

అన్నదాన, రక్తదాన శిబిరాలు, ఆసుపత్రుల్లో పాలు, పండ్ల పంపిణీకి సమాయత్తం

వేలాది మందితో దీక్షా దివస్ సభ

బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:తెలంగాణ రాష్ట్ర  సాధనకోసం కేసీఆర్  ఆమరణ దీక్ష చేపట్టిన చారిత్రిక ఘట్టాన్ని పురస్కరించి  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం "దీక్షాదివస్" నిజామాబాద్ నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు బీ ఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దీక్షా దివస్ సభ కోసం  బీ ఆర్ఎస్ జిల్లా కార్యాలయం ముస్తాబైనట్లు ఆయన చెప్పారు. భావితరాలకు స్పూర్తినిచ్చే విధంగా దీక్షా దివస్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశామన్నారు. 

వేలాది మందితో దీక్షా దివస్ సభ జరుగుతుందని, జిల్లాలోని ప్రతి మండలం నుంచి వంద మందికి పైగా మొత్తం 5నుంచి పది వేల మంది వరకు సభకు హాజరవుతారని భావిస్తున్నట్లు జీవన్ రెడ్డి పేర్కొన్నారు.

దీక్ష దివాస్ సందర్భంగా వినాయక్ నగర్ లో గల అమరవీరుల స్థూపం వద్ద ఘనంగా నివాళులర్పిస్తామని అనంతరం  బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసిన తరువాత అంబేద్కర్, గాంధీ విగ్రహాలకు పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పిస్తామన్నారు. దీక్షాదివస్ కర్మ, కర్త, క్రియ అయిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తామన్నారు.ఈ సందర్భంగా  అన్నదాన, రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆసుపత్రుల్లో రోగులకు పాలుపండ్లు పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా,బాజిరెడ్డి గోవర్దన్,బోధన్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆయేషా ఫాతిమా షకీల్,వి.జి గౌడ్, మాజీ జడ్పి ఛైర్మన్ విఠల్ రావులతో పాటు జిల్లా పార్టీ సీనియర్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమ కారులు,యువకులు తదితరులు పాల్గొంటారని జీవన్ రెడ్డి వెల్లడించారు

Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 21:54:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 08:04:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 19:39:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 19:32:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 19:30:41

Readmore >
Image 1

కాలినడక ద్వారా తిరుమలకు చేరిన 116 ఏళ్ల వృద్ధురాలు

Posted On 2026-07-05 17:09:50

Readmore >
Image 1

ఒవైసీ కాలేజ్ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్!!

Posted On 2026-07-05 17:08:44

Readmore >
Image 1

ఏలూరు జిల్లాలో విషాదం... రైలు ఢీకొని నలుగురి మృతి

Posted On 2026-07-05 11:44:43

Readmore >
Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >