| Daily భారత్
Logo




తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళు ప్రస్తుతం రాష్ట్రానికి ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షులు అవడం దురదృష్టకరం

News

Posted on 2025-11-29 16:52:10

Share: Share


తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళు ప్రస్తుతం రాష్ట్రానికి ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షులు అవడం దురదృష్టకరం

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమం చేసిన రోజుల్లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ అడ్రస్ ఎక్కడ..?

పిసిసి అధ్యక్షుడిపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రానికి  దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రానికి ఏమాత్రం సంబంధంలేని వ్యక్తులు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షులు అయ్యారని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. శనివారం దీక్షా దివస్ సందర్భంగా జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 

మాజీ ముఖ్యమంత్రి  కెసిఆర్ ఉద్యమం చేసినా రోజుల్లో ఎంతోమంది తెలంగాణ సాధన కోసం విద్యార్థులు బలిదానమైన రోజున ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అడ్రస్ ఎక్కడ నో తెలంగాణ ప్రజలకే తెలియని పరిస్థితి అప్పటిదని ఇప్పుడు తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యమంలో లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధికార అహంకారంతో ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేక పోతున్నారని ఆయన అన్నారు. ఇది తెలంగాణ ప్రజలు చేసుకున్న దురదృష్టకరమైన విషయం అన్నారు. తెలంగాణ సాధన కోసం అప్పట్లో కెసిఆర్ దీక్షతో తెలంగాణ రాలేదా అని ప్రశ్నించారు. 2009 నవంబర్ 9న కేసిఆర్ దీక్ష ఫలితంగా కేంద్రం ప్రకటన చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. అప్పటి భారత హోంమంత్రి చిదంబరం చేసిన ప్రకటన నిజం కాదా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామని కేసీఆర్ దీక్ష విరమించమని అప్పటి హోం మంత్రి చిదంబరం ప్రకటన చేయలేదా అని అడిగారు.

తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ప్రారంభిస్తాం కేసిఆర్ ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నామని చిదంబరం అన్నారు లేదో కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తు తెచ్చుకోవాలన్నారు.

కెసిఆర్ దీక్షతో తెలంగాణ అంతా అటు ఉడికిందని,

తెలంగాణ రాష్ట్రానికి కెసిఆర్ జాతిపిత తెలంగాణ ప్రజల కొరకు ప్రాణాన్ని సైతం పనంగా పెట్టిన వ్యక్తి కేసీఆర్ అని గుర్తు చేశారు. 15 సంవత్సరాల పాటు ఉన్న అన్ని పదవులు వదిలేసి స్వచ్ఛందంగా ఒక్కడిగా తెలంగాణ ఉద్యమ కొరకు బయలుదేరారన్నారు.

కేసీఆర్ గురించి మహేష్ కుమార్ గౌడ్ అవాక్కులు, చేవాక్కులు పేలితే జాగ్రత్త అని ఆయన గురించి మాట్లాడే నైతిక హక్కు మహేష్ కుమార్ గౌడ్ కు లేదని దుయ్యబట్టారు.

సోనియా గాంధీకి ఎందుకు పూలమాలలు వేయాలని, వేలాదిమంది విద్యార్థుల బలిదానాలకు కారణమైనందుకు సోనియాగాంధీకి పూలమాలలు వేయాలో మహేష్ కుమార్ గౌడ్ సమాధానం చెప్పాలన్నారు. కార్యక్రమంలో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, నిజాంబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, భోజనం మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ సతీమణి అయేషా ఫాతిమా, పార్టీ ముఖ్య సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 21:54:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 08:04:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 19:39:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 19:32:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 19:30:41

Readmore >
Image 1

కాలినడక ద్వారా తిరుమలకు చేరిన 116 ఏళ్ల వృద్ధురాలు

Posted On 2026-07-05 17:09:50

Readmore >
Image 1

ఒవైసీ కాలేజ్ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్!!

Posted On 2026-07-05 17:08:44

Readmore >
Image 1

ఏలూరు జిల్లాలో విషాదం... రైలు ఢీకొని నలుగురి మృతి

Posted On 2026-07-05 11:44:43

Readmore >
Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >