| Daily భారత్
Logo




రాజన్న సిరిసిల్ల : వేములవాడ పట్టణం అగ్రహారంలో జరిగిన హత్య కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్,రిమాండ్

News

Posted on 2025-11-29 20:59:43

Share: Share


రాజన్న సిరిసిల్ల : వేములవాడ పట్టణం అగ్రహారంలో జరిగిన హత్య కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్,రిమాండ్

డైలీ భారత్ న్యూస్, రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో మాజీ పీపుల్స్ వార్ గ్రూప్ దళ కమాండర్ బల్లెపు నరసయ్య @ సిద్దయ్య @ బాపిరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు జక్కుల సంతోష్ ని అరెస్ట్ రిమాండ్ చేసినట్లు వేములవాడ ఇంచార్జ్ డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు.

ఈసందర్భంగా ఇంచార్జ్ డిఎస్పీ మాట్లాడుతూ..

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగాలపల్లి మండలం గండి లచ్చపెట్ గ్రామానికి చెందిన బల్లెపు నర్సయ్య @సిద్దయ్య@బాపిరెడ్డి అనే వ్యక్తి గతంలో పీపుల్స్ వార్ గ్రూప్‌లో దళ కమాండర్‌గా పనిచేసేవాడు.1999లో వీర్నపల్లి బస్టాండ్ వద్ద నర్సయ్య  సహా దళ సభ్యులు వీర్నపల్లి కి చెందిన అంజయ్యను పోలీస్ ఇన్ఫార్మర్ గా భావించి కాల్చివేసిన ఘటనపై అప్పట్లో ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది.ఈఘటనపై అజంయ్య కుమారుడు జక్కుల సంతోష్ తన తండ్రిని చంపిన వ్యక్తిపై కక్ష్య పెంచుకున్నాడు.ఇటీవలి కాలంలో బల్లెపు నర్సయ్య ఒక యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ చూసిన సంతోష్  మరింత కక్ష్య పెంచుకొని బల్లెపు నర్సయ్య తో ఒక రిపోర్టర్ గా పరిచయం పెంచుకొని గత మూడు నెలలుగా ఇంటర్వ్యూ చేస్తానని నమ్మించి ఇంటర్వ్యూ కోసం ఆగ్రహరం గ్రామానికి రావాలని బల్లెపు నర్సయ్య కు చెప్పగా నరసయ్య నవంబర్ 27  రోజున మధ్యాహ్ననానికి ఇద్దరు  అగ్రహారం గ్రామానికి చేరుకోగా సంతోష్ ముందే సిద్ధం చేసుకున్న పథకం ప్రకారం, ఆప్రాంతంలో ఒంటరిగా ఉన్న సమయంలో రాళ్లతో దాడి చేసి మృతుడిని అక్కడికక్కడే హత్య చేశాడు.

ఈ ఘటనపై వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి ఆధునిక సాంకేతికతతో విచారణ చేపట్టి ఈరోజు నిందితుడు జక్కుల సంతోష్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించడం జరిగిందని ఇంచార్జ్ డిఎస్పీ నాగేంద్రచరి తెలిపారు.

ఈకేసును విజయవంతంగా ఛేదించిన సిఐ వీర ప్రసాద్, ఎస్సై రామ్మోహన్, పోలీస్ సిబ్బందిని డీఎస్పీ నాగేంద్రచారి అభినందించారు.

Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 21:54:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 08:04:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 19:39:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 19:32:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 19:30:41

Readmore >
Image 1

కాలినడక ద్వారా తిరుమలకు చేరిన 116 ఏళ్ల వృద్ధురాలు

Posted On 2026-07-05 17:09:50

Readmore >
Image 1

ఒవైసీ కాలేజ్ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్!!

Posted On 2026-07-05 17:08:44

Readmore >
Image 1

ఏలూరు జిల్లాలో విషాదం... రైలు ఢీకొని నలుగురి మృతి

Posted On 2026-07-05 11:44:43

Readmore >
Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >