Posted on 2025-11-29 18:31:38
డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం వేపలగడ్డ గ్రామంలోని లింగం మాలకొండ రెడ్డి ఇంటి పనిమనిషి సుజాతనగర్ గ్రామానికి చెందిన కావేటి కృష్ణవేణి అను మహిళ గత మూడు సంవత్సరాల నుండి ఆ ఇంట్లో పనిచేస్తూనమ్మకంగా ఉంటూ ఇంటి యజమానికి తెలియకుండా ఆ ఇంట్లో కబోర్డ్ లోదాచిన సుమారు 7139 గ్రాముల వెండి వస్తువులను మరియు 11.9 గ్రాములు గల బంగారపు వస్తువులను దొంగలించి అట్టి వస్తువులను కృష్ణవేణి మరియు ఆమె భర్త అయిన కావేటి రాంబాబు కలిసి కొత్తగూడెం చిన్న బజారులో అమ్మినారు. ఫిర్యాది లింగమాల కొండారెడ్డి ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసి దొంగతనం చేసిన కృష్ణవేణిను, అందుకు సహకరించిన ఆమె భర్త రాంబాబును, అదే విధంగా అట్టి దొంగ వస్తువులను అమ్మిన మాధవాచారి మరియు శోభన్ చారీను, గోల్డ్ షాప్ యజమానులను ఈరోజు చుంచుపల్లి సిఐ అరెస్టు చేసి వారి వద్ద నుండి కేసు యొక్క బంగారం మరియు వెండి సామాన్లను స్వాధీనపరచుకోవడంజరిగింది
గోల్డ్ మరియు వెండి రికవరీ చేసి కేసును చేదించి నిందితుల వద్ద నుండి బంగారం మరియు వెండి సొమ్మును రికవరీ చేసిన చుంచుపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాయల వెంకటేశ్వర్లు , సుజాతనగర్ ఎస్సై రమాదేవి సుజాతనగర్ సిబ్బందినీ, క్లూస్ టీం సిబ్బంది అయిన శోభన్ ను, కొత్తగూడెం సబ్ డివిజన్ డీఎస్పీ అబ్దుల్ రహమాన్ ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >