| Daily భారత్
Logo




సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్యపై, ఎన్కౌంటర్లో మృతిచెందిన రియాజ్ ఘటనపై సిట్టింగ్ హైకోర్టు జడ్జిచే న్యాయ విచారణ చేయాలి

News

Posted on 2025-11-29 18:17:54

Share: Share


సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్యపై, ఎన్కౌంటర్లో మృతిచెందిన రియాజ్ ఘటనపై సిట్టింగ్ హైకోర్టు జడ్జిచే న్యాయ విచారణ చేయాలి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఇటీవల నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించిన సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య పై, అలాగే పాత నేరస్థుడు రియాజ్ ఎన్కౌంటర్ పై హైకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ చేయాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని, వారి పిల్లలకు ప్రభుత్వమే చదివించే బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రమోద్ చిన్న కుమారుడిని,ప్రమోద్ తల్లికి అనారోగ్యానికి గురై ఉన్నారు, వారికీ సరైనటువంటి వైద్య సౌకర్యం ప్రభుతమే కల్పించాలన్నారు. పోలీస్ ఎన్కౌంటర్ లో చనిపోయిన రియాజ్ కుటుంబానికి ప్రభుత్వం సహాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసు అధికారుల నిర్లక్ష్యం వలనే రెండు నిండు ప్రాణాలు పోయినవని ఆయన అభిప్రాయపడ్డారు. విలేకరుల సమావేశంలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం నారాయణరావు, రాష్ట్ర నాయకులు వి. సంగం, రాష్ట్ర సహాయ కార్యదర్శులు బాలయ్య, అల్గోట్ రవీందర్, నిజామాబాదు  జిల్లా  కార్యదర్శి జలంధర్, సీనియర్ నాయకులు, న్యాయవాదులు ఎడ్ల రాము, వీరభద్రప్ప లు పాల్గొన్నారు.

Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 21:54:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 08:04:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 19:39:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 19:32:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 19:30:41

Readmore >
Image 1

కాలినడక ద్వారా తిరుమలకు చేరిన 116 ఏళ్ల వృద్ధురాలు

Posted On 2026-07-05 17:09:50

Readmore >
Image 1

ఒవైసీ కాలేజ్ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్!!

Posted On 2026-07-05 17:08:44

Readmore >
Image 1

ఏలూరు జిల్లాలో విషాదం... రైలు ఢీకొని నలుగురి మృతి

Posted On 2026-07-05 11:44:43

Readmore >
Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >