Posted on 2025-11-30 07:39:40
త్వరలో సంఘాల భేటిసమస్యలన్నీ పరిష్కరిస్తాం అని మంత్రి హామీ
డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా; జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూకే.ఎఫ్) రాష్ట్ర కమిటీ రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేసింది. శనివారం హైదరాబాద్ లోని సచివాలయంలోని తన చాంబర్లో టీడబ్ల్యూజేఎఫ్ ఆర్ట్స్క్ కమిటీ కన్వీనర్ పి రాంచందర్, ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య ఉపాధ్యక్షులు పి రాధిక, గుడిక రఘు, బి.రాజశేఖర్, కార్యదర్శి ఈ చంద్రశేఖర్, హెచ్ఎయూజే అధ్యక్షులు బి అరుణ్కుమార్, నాయకులు అచ్చిన ప్రశాంత్ తదితరులు మంత్రిని కలిశారు. దాదాపు గంటపాటు జర్నలిస్టుల సమస్యంపై చర్చించారు. వెంటనే అక్రిడిటేషన్లు ఇవ్వాలనీ, ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో కొత్త ఆరోగ్య కార్డులు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఇండ్లస్థలాల విషయంలో కొత్త విధానం తీసుకురావాలని మంత్రిని కోరారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇండ్లస్థలాల సమస్యలతో జర్నలిస్టు సంఘాలు, సీనియర్ జర్నలిస్టుతో సమావేశం నిర్వహించి పరిష్కరించాలని అన్నారు. చనిపోయిన జర్నలిస్టులకు రూ. 20 లక్షల ఎక్స్రేషియా చెల్లించాలని సూచించారు. మహిళా జర్నలిస్టులకు రాత్రి పూట పనిచేసే చోట నుంచి ఇంటివరకు రవాణా సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దేశంలోని ఇతర రాష్ట్రాల మాదిరిగా రిటైరైన జర్నలిస్టులకు పెన్షన్ వసతిని ప్రవేశపెట్టాలని కోరారు. రాష్ట్ర, జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమటీలు ఏర్పాటు చేయాలనీ, జర్నలిస్టులపై దాడులకు సంబంధించి అటాక్స్ కమిటీని నియమించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు స్పందించిన మంత్రి త్వరలో జర్నలిస్టుల సంఘాలతో సమావేశం నిర్వహించి సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. అంతకుముందు సమాచార శాఖ డైరెక్టర్ కిషోర్బాబు, అదనపు డైరెక్టర్ డిఎస్ జగన్ కు సైతం వినతిపత్రాలు అందజేశారు..
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >