| Daily భారత్
Logo




కొండగట్టులో భారీ అగ్నిప్రమాదం

News

Posted on 2025-11-30 10:40:49

Share: Share


కొండగట్టులో భారీ అగ్నిప్రమాదం

కొండగట్టులో భారీ అగ్నిప్రమాదం.. కోట్లలో ఆస్తి నష్టం

కొండగట్టు వద్ద గత రాత్రి భారీ అగ్నిప్రమాదం

32 బొమ్మల దుకాణాలు పూర్తిగా దగ్ధం

సమ్మక్క జాతర కోసం నిల్వ ఉంచిన సరుకు బూడిద

కోట్లాది రూపాయల ఆస్తినష్టం జరిగిందని అంచనా

విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమిక నిర్ధారణ

డైలీ భారత్ న్యూస్, కొండగట్టు: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో శనివారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో దాదాపు 32 బొమ్మల దుకాణాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. వ్యాపారులకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

గత రాత్రి 11 గంటల సమయంలో కొండగట్టు ఘాట్ రోడ్డులోని అభయ హనుమాన్ విగ్రహం నుంచి ప్రధాన రహదారి వరకు ఉన్న బొమ్మల దుకాణాల్లో మంటలు చెలరేగాయి. సమీపంలో జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతరను దృష్టిలో ఉంచుకుని వ్యాపారులు భారీ ఎత్తున బొమ్మలను కొనుగోలు చేసి దుకాణాల్లో నిల్వ ఉంచారు. ఒక్కో దుకాణంలో రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల విలువైన సామగ్రి ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేసరికి దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి. తమ కళ్లెదుటే సర్వస్వం కాలిపోవడంతో వ్యాపారులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వారి రోదనలతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మల్యాల, ధర్మపురి సీఐలు రవి, రాంనర్సింహారెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 21:54:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 08:04:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 19:39:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 19:32:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 19:30:41

Readmore >
Image 1

కాలినడక ద్వారా తిరుమలకు చేరిన 116 ఏళ్ల వృద్ధురాలు

Posted On 2026-07-05 17:09:50

Readmore >
Image 1

ఒవైసీ కాలేజ్ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్!!

Posted On 2026-07-05 17:08:44

Readmore >
Image 1

ఏలూరు జిల్లాలో విషాదం... రైలు ఢీకొని నలుగురి మృతి

Posted On 2026-07-05 11:44:43

Readmore >
Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >