Posted on 2025-11-30 14:02:23
డైలీ భారత్ న్యూస్, రాజన్న సిరిసిల్ల:తేదీ 30 .11.2025 ఆదివారం రోజున ఉదయం 10 గంటలకు సమావేశమై పేద కుటుంబానికి చెందిన చదువులో రాణించే విద్యార్థులకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం అన్న సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ (SWA)సిరిసిల్ల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న నిరుపేద కుటుంబాలకు చెందిన 8 మంది విద్యార్థులు పుట్ట రీచా, సిలివరి వికాస వర్ధన్ గుగ్గిల్ల అలేఖ్య, ఎర్రవెల్లి అక్షయ, ఈ .పూజశ్రీ, చీకట్ల అక్షయ, కన్నం చందు, జిల్ల వర్షిత విద్యార్థులకు ఒక్కొక్కరికి 5వేల రూపాయల చొప్పున అందించడం జరిగింది
ఈ సందర్భంగా అధ్యక్షులు మోతె దేవి రెడ్డి మాట్లాడుతూ....
సామాజిక దృక్పథం కలిగిన మిత్రులతో ఏర్పాటుచేసిన ఈ సంస్థ swa అన్నివేళలా ఎల్లప్పుడూ ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు అండగా ఉంటుందని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవడంలో ఈ సంస్థ తోడ్పాటు అందిస్తుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సెక్టోరియల్ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన దబ్బెడ హనుమాన్లు కి మరియు పదవీ విరమణ చెందిన మారం స్వదేశ్ కుమార్ కి, బాల్రెడ్డి కి, రవీందర్ రెడ్డి కి సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పంజాల వెంకటేశ్వర్లు, వడ్లకొండ చంద్రం పాతూరు మహేందర్ రెడ్డి , మధుకర్ రావు,దుమాల రమానాద్ రెడ్డి ,గోవర్ధన్ , రాజలింగారెడ్డి ,మదుసూదన్ రెడ్డి ,రాజశేఖర్ రెడ్డి ,బాల్రెడ్డి, మైలారం తిరుపతి, బుస రాజేందర్ ,గోవర్ధన్ రెడ్డి సిద్ధంశెట్టి శ్రీనివాస్ ,సకినాల భాస్కర్ ,హనుమాన్లు ,తిరుపతి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్ ,శేఖర్ రెడ్డి ,ఆనంద్ రెడ్డి , రవీందర్ రెడ్డి కదిరె శ్రీనివాస్ , విక్కుర్తి అంజయ్య, హన్మంత రెడ్డి, కిషన్ రావు, శనగరం శ్రీనివాస్, మొదలగువారు పాల్గొన్నారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >