Posted on 2025-12-01 18:02:20
డైలీ భారత్ న్యూస్ రాజన్న సిరిసిల్ల: నవంబర్ 28 29 తేదీలలో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన వైజ్ఞానిక ప్రదర్శనలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మన్నపేట విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపికైన సందర్భంగా నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మన్నపేట ఉపాధ్యాయ బృందం వారికి అభినందనలు తెలియజేయడం జరిగింది
ఈ సందర్భంగా సీనియర్ ఉపాధ్యాయులు బోయన్నగారి నారాయణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మా విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం అభినందనీయం అన్నారు ఈరోజు అభినందించిన విద్యార్థినిలు ఈరవేణి నందిని, మూడ్ అక్షర 9 వ తరగతి ఈరవేణి మధుప్రియ పదవ తరగతి లు ఉన్నారు అదేవిధంగా రాష్ట్రస్థాయిలో నిలబడి జాతీయ స్థాయికి ఎంపిక కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు
ఇట్టి కార్యక్రమంలో తాడూరి సంపత్ కుమార్ గైడ్ టీచర్ మారేపల్లి రాజు గుడికాడ కొమరయ్య శనిగరం నారాయణ అజ్మీర కవిత జడల విజయ శ్రీ తల్లిదండ్రులు ఉన్నారు
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >