| Daily భారత్
Logo




విజయవంతమైన కల్లుగీత కార్మిక సంఘం kgks రాష్ట్ర మహాసభలు

News

Posted on 2025-12-01 18:28:58

Share: Share


విజయవంతమైన కల్లుగీత కార్మిక సంఘం kgks రాష్ట్ర మహాసభలు

రాష్ట్ర కమిటీలోకి జిల్లా అధ్యక్షులు కోయడి నర్సింహులు గౌడ్, సిడుగు శేఖర్ గౌడ్.

రాష్ట్ర సలహా దారులు పెద్ది వెంకటరాంలు వెల్లడి.

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: కళ్ళు గీత కార్మిక సంఘం రాష్ట్ర నాలుగో మహాసభలు నవంబరు 28 29 30 మూడు రోజులపాటు సూర్యాపేటలో విజయవంతంగా జరిగినట్లు కల్లుగీతా కార్మిక సంఘం రాష్ట్ర సలహాదారులు పెద్ది వెంకట రాములు తెలిపారు.

ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కల్లుగీత కార్మిక సంఘం కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కోయడి నర్సింహులు గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పెద్ది వెంకట రాంలు మాట్లాడుతూ మొదటిరోజు బహిరంగ సభకు గీత గౌడ కార్మికులు వేలాదిగా తరలివచ్చారని అలాగే రెండు రోజులు జరిగిన ప్రతినిధుల సభకు వివిధ జిల్లాల నుంచి హాజరైన ప్రతినిధుల సభ గీత వృత్తి రక్షణ, వారి సంక్షేమం, సమస్యల పై సమగ్రంగా చర్చించి, భవిష్యత్ కార్యాచరణ లో భాగంగా రాష్ట్ర స్థాయిలో ధర్నాలు, ర్యాలీ లు చేయాలని,చెట్టు నుండి వందలాది మంది పడి మరణిస్తున్నారని ప్రభుత్వం వృత్తి ని ఆదునీకరించి వృత్తి రక్షణ, ఇతర ఉపాధి అవకాశలు కల్పించే చర్యలు తీసుకోవాలని లేనట్లయితే ఉద్యమాలే శరణ్యమని సభ లో తీర్మానిచ్చారాన్నారు.

నిజామాబాదు జిల్లా నుండి కోయేడి నర్సింహులు గౌడ్, శేఖర్ గౌడ్ లను రాష్ట్ర కమిటీ లోకి తీసుకున్నట్లు వారు తెలిపారు.

జిల్లా అధ్యక్షులు కోయడి నర్సింహులు గౌడ్ మాట్లాడుతూ గౌడ, గీత కార్మికుల సమస్య లపై సమిష్టిగా పోరాడాలని, అలాగే స్థానిక ఎన్నికల్లో మన గౌడ, గీతన్నలు నిలబడితే ఓటు వేసి గెలిపించుకోని మన సత్తా చూపాలన్నారు.

ఇట్టి సమావేశంలో జిల్లా కార్యదర్శి సీదుగు శేఖర్ గౌడ్, ఉపాధ్యక్షులు సెపూర్ సాయగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 21:54:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 08:04:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 19:39:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 19:32:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 19:30:41

Readmore >
Image 1

కాలినడక ద్వారా తిరుమలకు చేరిన 116 ఏళ్ల వృద్ధురాలు

Posted On 2026-07-05 17:09:50

Readmore >
Image 1

ఒవైసీ కాలేజ్ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్!!

Posted On 2026-07-05 17:08:44

Readmore >
Image 1

ఏలూరు జిల్లాలో విషాదం... రైలు ఢీకొని నలుగురి మృతి

Posted On 2026-07-05 11:44:43

Readmore >
Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >