Posted on 2025-12-01 18:30:40
పీసీసీ చీఫ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీల సమక్షంలో ప్రమాణ స్వీకార మహోత్సవం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుల ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కాటేపల్లి నగేష్ రెడ్డి , నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా బొబ్బిలి రామకృష్ణ లను అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిసిసి అధ్యక్షుడు మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అధ్యక్షులకు అభినందనలు తెలియజేసిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, పార్టీ బలోపేతం కోసం గ్రామస్థాయి వరకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజల సమస్యలు తీర్చడంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు.
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >