| Daily భారత్
Logo




ఏసిబి అధికారి ముసుగులో వసూళ్ళకు పాల్పడుతున్న ముఠాలోని ఐదుగురి సభ్యుల అరెస్టు

News

Posted on 2025-12-01 20:30:09

Share: Share


ఏసిబి అధికారి ముసుగులో వసూళ్ళకు పాల్పడుతున్న ముఠాలోని ఐదుగురి సభ్యుల అరెస్టు

డైలీ భారత్ న్యూస్, వరంగల్: ఏసిబి డీఎస్పీ అధికారి ముసుగులో ప్రభుత్వ అధికారులను బెదిరిస్తూ బలవంతపు వసూళ్ళకు పాల్పడుతున్న ఘరానా నిందితుడితో పాటు అతనికి సహకరించిన మరో నలుగురిని వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్, మిల్స్ కాలనీ పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్టు చేయగా, మరో ముగ్గురు నిందితులు పరారీలో వున్నారు. ఈ ముఠా సభ్యుల నుండి పోలీసులు ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు అరెస్టు చేసిన వారిలో ప్రధాన నిందితుడు రాచంపల్లి శ్రీనివాస్ అలియాస్ మంగళ  శ్రీను అలియాస్ వాసు, వయస్సు 45  సం.లు, వేలమద్ధి గ్రామం, నల్లమాడ మండలం, సత్యసాయి పుట్టపర్తి జిల్లా, ఆంధ్రప్రదేశ్  రాష్ట్రం, 2. నవీన్ JR, హరోహళ్లీ తాలుకా, రాంనగర్ జిల్లా, కర్ణాటక రాష్ట్రం, 3. మంగళ రవీందర్, యశ్వంతపూర్, బెంగుళూర్, కర్ణాటక, 4. మురళి, బెంగుళూరు, కర్ణాటక రాష్ట్రం, 5. N. ప్రసన్న, బెంగుళూరు, కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించగా, ప్రస్తుతం సూర్యప్రకాశ్, తాటిమర్రి వేణు, కొత్తకోట రమణ పరారీలో వున్నారు.

ఈ అరెస్టుకు సంబందించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ వెల్లడిస్తూ పోలీసులు అరెస్టు చేసిన ప్రధాన నిందితుడు రాచంపల్లి శ్రీనివాస్, ప్రభుత్వ శాఖలలో ఉన్నత పదవులో పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులతో పాటు పదవీవిరమణకి దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకోని వారికి ఏసిబి డి.ఎస్పీ నంటూ ఫోన్ చేసి “మీ మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి, కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు నుండి బయటపడాలంటే డబ్బులు ఇవాల్సి వుంటుంది” అని బెదింపులకు పాల్పడి సులభంగా డబ్బు సంపాదించాలకున్నాడు. ఇందులో భాగంగా నిందితుడు వరంగల్ జిల్లా రోడ్డు రవాణా శాఖలో మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న తుమ్మల జైపాల్ రెడ్డికి ఫోన్ చేసి ఎసిబి డీ. ఎస్పీ నంటూ బెదిరించి సుమారు 9 లక్షల 96 వేల రూపాయలను వివిధ మార్గాల్లో దోచేయడంతో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో మిల్స్ కాలనీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులకు అందుబాటులో వున్న టెక్నాలజీని వినియోగించుకోని ప్రధాన నిందితుడు రాచంపల్లి శ్రీనివాస్ ను మరియు అతనికి సహకరించిన మరో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోని విచారణ చేపట్టారు.

ప్రధాన నిందితుడున శ్రీనివాసులును పోలీసులు విచారించగా, నిందితుడు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో 2002 సంవత్సరంలో మొదట ద్విచక్ర వాహనం చోరీతో దొంగతనాలకు శ్రీకారం చూట్టాడు. మరో కొద్ది రోజులు నిందితుడు నకిలీ పోలీస్ అధికారిగా అవతారమెత్తి రాయలసీమ ప్రాంతములో జరిగిన పలు దొంగతనాల్లో అరెస్టు అయిన నిందితుల కుటుంబ సభ్యులను టార్గెట్ గా చేసుకొని వారి వద్ద దొంగ సొత్తు దాచి ఉంచారని బెదిరించి వారి నుండి బంగారం, డబ్బు దోపిడికి  పాల్పడటంతో సుమారు 50 కేసుల్లో నిందితుడుని పోలీసులు అరెస్టు చేసి జైలు తరలించారు. జైలులో  నిందితుడు తన వ్యవహర శైలిని  మార్చుకోకుండ జైలు నుండి విడుదలైన అనంతరం కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు మరియు రాయలసీమ ప్రాంతాల్లో 41కి పైగా చైన్ స్నాచింగ్ లకు పాల్పడటం తో పోలీసులు మరోమారు నిందితుడి అరెస్టు చేసి జైలుకు తరలించారు.

నిందితుడు జైలు నుండి విడుదలైన అనంతరం మళ్ళీ సులభంగా డబ్బును సంపాదించాలనే లక్ష్యంగా నకిలీ ఎసిబి డీ.ఎస్పీగా అవతారం ఎత్తి ప్రభుత్వ ఉద్యోగులను ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతూ ఇప్పటివరకు ఇతనిపై మొత్తం 19 కేసులు నమోదు అయి సుమారు రూ 50 లక్షలు పైగా దోపిడీకి పాల్పడగా, ఇందులో తెలంగాణ రాష్ట్రంలో 09 నేరాలు, ఆంధ్ర రాష్ట్రంలో 10 నేరాలకు పాల్పడ్డాడు. ఇందులో 8 కేసుల్లో అరెస్ట్ కాగా, మిగిలిన 11 కేసుల్లో వరంగల్ కమిషనరేట్ పరిధిలో మిల్స్ కాలనీతో పాటు 2021 సంవత్సరంలో స్టేషన్ ఘన్పూర్ అలాగే కరీంనగర్, హైదరాబాద్, రాచకొండ, రామగుండం, వికారాబాద్, జగిత్యాల, వనపర్తి లతో పాటు ఆంధ్రలోని కర్నూల్ జిల్లాలో జరిగిన 02 నేరాలలో  అరెస్ట్ కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు.

ఈ విధంగా బెదిరింపులకు పాల్పడుతూ దోచేసిన డబ్బును నిందితుడు ప్రస్తుతం పోలీసులు అరెస్టు చేసి విచారణలో వున్న మిగితా నిందితులతో పాటు, ప్రస్తుతం పరారీలో వున్న నిందితులతో కలసి ఆన్లైన్ బెట్టింగ్ మరియు గోవాలో కాసినో లలో జూదం ఆడటంతో పాటు గోవా, బెంగుళూరు ప్రాంతాల్లో వ్యభిచార గృహాల్లో ఖర్చు చేసేవాడని పోలీసుల విచారణలో  నిందితుడు అంగీకరించాడు.

ఘరానా మోసగాడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డిసిపి  డి.కవిత గారిని, వరంగల్ ఎసిపి  ఎన్.శుబం ప్రకాష్ ఐపిఎస్, టాస్క్ఫోర్స్ ఎసిపి ఏ. మధుసూదన్ మరియు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్లు ఎల్. పవన్ కుమార్, కె. శ్రీధర్, ఎల్. మంగిలాల్, మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ బి. రమేష్ మరియు ఎస్.ఐ లు ఎస్. మహేష్, ఎం. సురేష్ లను మరియు టాస్క్ ఫోర్స్, మిల్స్ కాలనీ పి.ఎస్. సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించి రివార్డులను అందజేసారు.

Image 1

చలివేంద్ర కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ సమస్యలపై వినతి

Posted On 2026-04-13 17:33:33

Readmore >
Image 1

జూలూరుపాడు తాసిల్దార్ కి వడ్లు మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం

Posted On 2026-04-13 17:32:13

Readmore >
Image 1

కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా జాయింట్ కలెక్టర్ మెమోరాండం

Posted On 2026-04-13 17:30:28

Readmore >
Image 1

పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి - రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు

Posted On 2026-04-13 17:28:31

Readmore >
Image 1

వివాహిత హత్య కేసులో ప్రియుడు అరెస్ట్

Posted On 2026-04-13 16:39:06

Readmore >
Image 1

Arrive Alive అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం

Posted On 2026-04-13 16:25:36

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు నూతన గృహప్రవేశం కార్యక్రమానికి విచ్చేసిన టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-04-13 16:20:40

Readmore >
Image 1

కామారెడ్డి లో భారీ దొంగతనం

Posted On 2026-04-13 16:18:09

Readmore >
Image 1

రిలే నిరాహార దీక్ష

Posted On 2026-04-13 16:16:21

Readmore >
Image 1

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో IQAC - FDP

Posted On 2026-04-13 16:09:23

Readmore >