Posted on 2025-12-01 20:18:44
తమ నాయకుడిపై, తమ అధినేత్రి పై వ్యాఖ్యలు చేస్తే సహించేదే లేదు
కవిత జాగృతి అనుచరులు, ప్రశాంత్ రెడ్డి అనుచరుల మధ్య పోటా పోటీగా కొనసాగుతున్న వాగ్బానాలు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: కాలేశ్వరం ప్రాజెక్టుపై మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రశాంత్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలకు ఆయన అనుచరులు, కవిత జాగృతి అనుచరుల మధ్య జిల్లాలో కోల్డ్ వార్ కొనసాగుతుంది. గత రెండు రోజులుగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ అగాధాన్ని పెంచారు. ఇటీవల కామారెడ్డి పర్యటనలో కల్వకుంట్ల కవిత కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో ఏ ఒక్క ఎకరానికి కూడా మీరు ఇవ్వలేదన్న తమ నాయకురాలు మాటలు మాటకి వాస్తవమని గత రెండు రోజుల క్రితం తెలంగాణ జాగృతి జిల్లా నాయకులు విలేకరుల సమావేశంలో చెప్పిన విషయం తెలిసిందే శ్రీరామ్ సాగర్ ను కాలేశ్వరం నీళ్లతో నింపమన్న ప్రశాంత్ రెడ్డి మాటలు ఎలా నిజమవుతాయని అడిగిన తమ అధినేత్రి కల్వకుంట్ల కవిత మాటల్లో వాస్తవం లేదా అని తెలంగాణ జాగృతి నాయకులు ప్రశ్నించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ జాగృతి నాయకులు మాట్లాడుతూ
తెలంగాణ జాగృతి రైతు విభాగ రాష్ట్ర అధ్యక్షులు నవీన్ రెడ్డి మాట్లాడుతూ..ఆదివారం బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ నిజామాబాద్, కామారెడ్డి లో కాళేశ్వరము నీళ్లు రాలేదు అంటే మీ తండ్రి కేసీఆర్ ను అన్నట్టు కాదా అని విమర్శించిన ప్రశాంత్ రెడ్డి అనుచరుల మాటలను ఖండించారు అని పేర్కొన్నారు. కేసీఆర్ నిజామాబాద్ జిల్లాకు నీళ్లు ఇవ్వాలనే కాళేశ్వరం ప్రాజెక్టులో 20, 21, 21ఏ, 22 ప్యాకేజీలను తలపెట్టారు.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీటి భరోసా కోసమే ఎస్ ఆర్ ఎస్పీ పునరుజ్జీవం ప్రాజెక్టును తలపెట్టారు.. ప్రజలకు మంచి చేయాలనే లక్ష్యంతో ఆయన తలపెట్టిన ఈ ప్రాజెక్టులను కొందరు ధనార్జన కోసం ఉపయోగించుకున్నారు అన్నది నిజాం కాదా అని ఎద్దేవా చేశారు. రూ.1,067 కోట్ల ప్రారంభించిన ఎస్ ఆర్ఎస్పీ పునరుజ్జీవం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం నాలుగేళ్లలోనే రెట్టింపు ఎందుకయ్యింది?
దీనివెనుక ఉన్నది మీ నాయకుడు కదా కానీ ప్రశ్నించారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవం ప్రాజెక్టులోని మూడు పంపుహౌస్ ల ఎలక్ట్రో మెకానికల్, హైడ్రో మెకానికల్ పనుల వ్యయం రూ.600 కోట్ల నుంచి రూ.1,400 కోట్లకు పెరగడానికి కారకులెవరు మీ నాయకుడు కాదా అడిగారు.
ప్రపంచంలోనే అతి పెద్దదైనా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం కట్టి కాళేశ్వరం నీళ్లను నిజామాబాద్ జిల్లా ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ లోకి, కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ లోకి తీసుకొచ్చింది కేసీఆరే కదా? అటువంటి కేసీఆర్ ను అయన బిడ్డవై ఉండి కేసీఆర్ నీళ్లు తెలేదు అని అంటుంటే మా నాయకుడు ప్రశాంత్ రెడ్డి ఎందుకు ఊరుకుంటాడు అని ప్రశ్నించారు. 2023 జూలైలో ఎస్ ఆర్ఎస్ పీ పునరుజ్జీవం ప్రాజెక్టు ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 2.50 టీఎంసీల నీటిని ఎత్తిపోసింది నిజం అని అన్నారు. ఆ తర్వాత ఎగువ నుంచి భారీ వరద రావడంతో కింది నుంచి ఎత్తిపోసిన నీళ్లతో పాటు ఎగువ నుంచి వచ్చిన వరద సైతం ప్రాజెక్టు గేట్లు ఎత్తి స్పెల్ వే ద్వారా కిందికి వదిలేసింది అంతకుమించిన కఠోర వాస్తవం కాదా అని ప్రశ్నించారు. నిజాంసాగర్ లోకి కొండాపోచమ్మ నీటిని హల్దీ వాగు ద్వారా తరలించి 2021 యాసంగి పంటలకు నీటిని ఇచ్చారని మేము కూడా చెప్పామన్నారు. ఆ తర్వాత సంవత్సరాల్లో భారీ వర్షాలు కురవడంతో మళ్లీ ఎప్పుడూ ఆ అవసరం రాలేదని కూడా వివరించామన్నారు. ఇక్కడ ఇచ్చింది కేవలం చివరి తడులకు మాత్రమే అది కూడా స్టెబిలైజేషనే తప్ప కొత్త ఆయకట్టు కాదని, కాళేశ్వరం నిర్మించడంలో కేసీఆర్ సంకల్పాన్ని కవిత ఎక్కడా తక్కువ చేసి మాట్లాడలేదన్నారు. తొమ్మిదిన్నరేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నతర్వాత కూడా పనులు పూర్తికాక నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు సాగునీరు రాలేదు అన్న రైతుల ఆవేదనను మాత్రమే ఎత్తి చూపించారు. కవిత కాళేశ్వరం విషయంలో అబద్ధాలు మాట్లాడారు కాబట్టే ప్రశాంత్ రెడ్డి పత్రిక ముఖంగా చెప్పాడు నిజాలు చెప్పారని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు కానీ...కవిత అబద్ధాలు మాట్లాడలేదని
నిజాంసాగర్ ను నింపాము.
ఎస్ ఆర్ ఎస్ పీని కాళేశ్వరం నీళ్లతో నింపాము అని ప్రశాంత్ రెడ్డి అబద్ధాలు, అసత్యాలు చెప్పారని విమర్శించారు.
కావాలనుకుంటే ఆయన విడుదల చేసిన ప్రెస్ నోట్ ను మరోసారి చదువుకోవాలని హితవు పలికారు. నిజాంసాగర్ లోకి కొద్దిపాటి నీటిని కొండపోచమ్మ సాగర్ ద్వారా, పోచంపాడు డ్యాంలోకి 2.50 టీఎంసీలను ఎస్ ఆర్ఎస్పీ పునరుజ్జీవం ద్వారా ఎత్తిపోశారు. నిజాంసాగర్ కు ఇచ్చిన నీటితో ఆ ప్రాజెక్టు ఆయకట్టుకైనా కొంత భరోసా దక్కింది..
శ్రీంసాగర్ లోకి రివర్స్ పంపింగ్ ద్వారా తరలించిన నీరు ఉపయోగపడకపోగా ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో నదిలోకి వృథాగా పోయాయి.
కరెంట్ బిల్లు నష్టం తప్ప సాధించింది ఏమీ లేదు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పునరుజ్జీవం తెస్తామని చెప్పి నాలుగేళ్ల వ్యవధిలో ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రెట్టింపు చేసి ప్రజాధనం దోచుకుంటే దోపిడీని ప్రశ్నించొద్దా? అని అడిగారు. కవితక్క ఎప్పుడూ మంచిని మంచి అనే అంటారు చెడును చెడు అనే అంటారు.
కాళేశ్వరం ద్వారా నీళ్లు వచ్చి ఆ ప్రాజెక్టు ఆయకట్టు సాకులోకి వచ్చి ఉంటే అదే విషయాన్ని చెప్పేవారు కదా బిఆరెస్ నాయకులు మాట్లాడుతూ
ప్యాకేజ్ 21 పైప్ లైన్ ద్వారా కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి నిజామాబాద్ జిల్లాలోని కప్పలవాగు పెద్దవాగులో పారియ్యడం భీంగల్ ప్రాంత రైతులందరు కండ్లతో చూసినారు పూజలు చేసినరు. ఇది కూడా టివిళ్లలో వార్త పత్రికల్లో వచ్చింది వాస్తవం కాదా? అని అడిగారు. సబ్జెక్ట్ లేకుండా ప్రెస్ మీట్లో మీ అనుచరులతో మాట్లాడిస్తే నిజాలు కావు అని కొట్టి పారేశారు. కాళేశ్వరం ప్యాకేజీ 21కి నేరుగా మేడిగడ్డ నుంచి నీళ్లు రావు అనే వాస్తవాన్ని గుర్తిస్తే మంచిదన్నారు. ఎస్ఆర్ఎస్పీ నీటినే ప్యాకేజీ 20 ద్వారా తరలించి ప్యాకేజీ 21 పైపులైన్ ద్వారా కప్పలవాగులోకి ఒకే ఒక్కరోజు ఎత్తిపోశారని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఈ ఎత్తిపోతల ట్రయల్ రన్ నిర్వహించారు. దీనితో ఎంత ఆయకట్టు సాకులోకి వచ్చిందన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో కాళేశ్వరం ఆయకట్టు 71,262 ఎకరాలు.. ఇందులో ఎన్ని ఎకరాలు సాగులోకి వచ్చాయి? జర చెప్పాలన్నారు. నిజామాబాద్ తెలంగాణ జాగృతి అవంతి కుమార్ మాట్లాడుతూ..నవీన్ కుమార్.. మా ప్రశాంత్ రెడ్డి చర్చకు రావలసిన అవసరం లేదు..
మీరు నిజామాబాద్ కు వస్తే.. వరదకాలువ పై కట్టిన పంప్ హౌజ్ లు చూయిస్తాం, కాళేశ్వరం నీళ్లు రివర్స్ నడుస్తూ ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ లొ ఎలా పడ్డాయో మీడియా క్లిప్పింగ్స్ కూడా చూయిస్తం అట్లాగే కప్పల వాగు, పెద్దవాగులో కట్టిన ఔట్లెట్ పాయింట్స్ చూయిస్తాం . ప్యాకేజీ 21 లో ని మెయిన్ పైప్ లైన్ గుండా కాళేశ్వరం నీళ్లు ఎలా వచ్చి వాగుల్లో పడ్డాయో మీడియా క్లిప్పింగ్స్ కూడా చూయిస్తాం అని అంటున్న బిఆరెస్ నాయకులకు ఒక్కటే సమాధానం - వరద కాలువపై నిర్మించిన మూడు పంపుహౌస్ లను మేము కళ్లారా చూశామని, అందులో జరిగిన అవినీతి భాగోతం గురించి అంతకుమించిన అవగాహనతోనే ఉన్నామన్నారు. దీనివెనుక ఎవరున్నారనే వాస్తవాలు తెలుసుకోవాలనే ఆసక్తి మీకు ఉంటే మీరే తేదీ, సమయం నిర్ణయించండి అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ 20, 21, 21ఏ నిర్మాణ వ్యయం రూ.2,600 కోట్ల నుంచి రూ.4,800 కోట్లకు పెరగడం దాని ద్వారా ఎవరు అనుచిత లబ్ధిపొందారనే వివరాలు తెలుసుకోవాలనుకుంటే కూడా వెల్లడించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. మీరు ఫొటోలు, వీడియోల ద్వారా నీటిని చూపిస్తామని చెప్తున్నారు. తాము మాజీ మంత్రికి సవాల్ చేసినప్పుడే శ్రీరాంసాగర్ లోకి 2.50 టీఎంసీల నీటిని ఎత్తిపోసింది వాస్తవమని చెప్పామన్నారు. ఆ నీరు ఉపయోగపడలేదు సరికదా కరెంట్ బిల్లు వేస్ట్ అయ్యింది అని కూడా వివరించామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని ఒక్క ఎకరం ఆయకట్టు కూడా నీరు రాలేదు అని కవితక్క చేసిన ప్రకటనకు మేం కట్టుబడి ఉన్నాం.
దానిని నిరూపించి తీరుతాం అని స్పష్టం చేశారు. మీ నాన్న బతికుండగా మీ చెల్లె వచ్చి తన తండ్రికి చైర్మన్ పదవి ఇవ్వమని కవితక్కను అడిగింది వాస్తవం కాదా..? అని అడిగారు. మీరు, మీ సోదరుల గ్రానైట్, ఇసుక అక్రమ దందాలపై హైదరాబాద్ లో ఒక పెద్ద రెడ్డి మధ్యవర్తిత్వం ద్వారా ప్రశాంత్ రెడ్డి మీరు, మీ సోదరులు అజయ్, వంశీ రేవంత్ రెడ్డి కాళ్లు మొక్కింది వాస్తవం కాదా?
రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు కూడా మిమ్మల్ని తరిమే రోజులు వస్తాయని అన్నారు. బోధన్ నియోజకవర్గ తెలంగాణ జాగృతి నాయకులు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రశాంత్ రెడ్డి నీకు ఎంపీ అర్వింద్ కు ఉన్న లోపాయికారి ఒప్పందం ఏంటని అడిగారు. గతంలో ప్రశాంత్ రెడ్డి అర్వింద్ కు వ్యతిరేకంగా నేను మాట్లాడను..నన్ను తిడుతడు అన్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఇద్దరి మధ్య ఏదో అగ్రిమెంట్ ఉంటేనే కదా అర్వింద్ కు వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉండటం చూస్తే వీరి మధ్య ఏదో రూపాయి కాయ ఒప్పందం కుదిరిందని జిల్లా ప్రజల్లో ముఖ్యంగా నియోజకవర్గ ప్రజల్లో అనుమానం కలుగుతుందన్నారు. బాల్కొండలో ఇసుక దందా చేసింది ఎవరని, భీమ్ గల్ లో అక్రమ గ్రానైట్ దందా చేసిందెవరు అని మాజీమంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ను కడిగిపారేశారు. బాల్కొండ లో గంజాయి కల్చర్ ఎక్కడి నుంచి వచ్చిందని, గంజాయి దందా సాగిస్తున్నది ఎవరు అని ప్రశ్నించారు. ఈ మీడియా సంవేశంలో తెలంగాణ జాగృతి నాయకులు కరిపే రాజు , మీసాల శంకర్, అంబటి శ్రీనివాస్ , శేఖర్ రాజ్, ఎండల ప్రసాద్, జనార్దన్, సాయికృష్ణ , ఆజాం, షాన్వాజ్, హరీష్, సందీప్, ఆకాష్ , వంశీ తెలంగాణ జాగృతి మహిళా నాయకులుశోభ ,సరిత ,రేఖ తదితరులు పాల్గొన్నారు.
ఎస్.ఆర్ నగర్ పోలీసుల కృషి.... పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు
Posted On 2026-04-13 19:09:44
Readmore >
జూలూరుపాడు తాసిల్దార్ కి వడ్లు మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం
Posted On 2026-04-13 17:32:13
Readmore >
కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా జాయింట్ కలెక్టర్ మెమోరాండం
Posted On 2026-04-13 17:30:28
Readmore >
పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి - రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు
Posted On 2026-04-13 17:28:31
Readmore >
ఇందిరమ్మ ఇల్లు నూతన గృహప్రవేశం కార్యక్రమానికి విచ్చేసిన టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-13 16:20:40
Readmore >