| Daily భారత్
Logo




నాగారం డంపింగ్ యార్డ్ ను సందర్శించిన అర్బన్ ఎమ్మెల్యే

News

Posted on 2025-12-02 17:15:55

Share: Share


నాగారం డంపింగ్ యార్డ్ ను సందర్శించిన అర్బన్ ఎమ్మెల్యే

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ పరిధిలోని నాగారం డంపింగ్ యార్డ్‌ను మంగళవారం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దండాల్మంగళవారం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ గుప్తా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం, ఈ డంపింగ్ యార్డ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు బయో-మైనింగ్ ద్వారా శుభ్రపరిచే పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. డంపింగ్ యార్డుల్లో పేరుకుపోయిన చెత్త వల్ల పరిసరాలకు చాలా సమస్యలు వస్తాయి. ఈ చెత్తను తొలగించడానికి బయో-మైనింగ్ పద్ధతి ఉపయోగిస్తున్నారు. దీనివల్ల పాత చెత్తను వేరు చేసి, శుభ్రపరచి, భూమిని తిరిగి ఉపయోగించుకునేలా చేస్తారన్నారు. మొదట చెత్తపై ప్రత్యేక ద్రావణం పిచికారీ చేసి వాసనలు తగ్గిస్తారన్నారు. తర్వాత ట్రమ్మెల్ యంత్రం ద్వారా చెత్తను మూడు భాగాలుగా వేరు చేస్తారు-ఎరువుగా ఉపయోగించే భాగం, కట్టడ పనులకు పనికొచ్చే భాగం, ఫ్యాక్టరీల కోసం ఇంధనంగా ఉపయోగించే ఆర్డిఎఫ్ మొత్తం 3,51,500 మెట్రిక్ టన్నుల చెత్తను శుద్ధి చేసే ప్రక్రియ త్వరలోనే పూర్తి అవుతుందని అధికారులు వివరించారు.

ప్రస్తుతం 2 మిషిన్లు పనిచేస్తుండగా, అదనంగా మరో 2 మిషిన్లు అవసరం పడతాయి అవి త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ చర్యలతో ప్రాంతం శుభ్రపడి, నాగారం డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందన్నారు. శుభ్రమైన, ఆరోగ్యకరమైన ఇందూర్ నగరాన్ని ఏర్పాటు చేయడమే తన లక్ష్యమని,ఆ దిశగా పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.

Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 21:54:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 08:04:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 19:39:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 19:32:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 19:30:41

Readmore >
Image 1

కాలినడక ద్వారా తిరుమలకు చేరిన 116 ఏళ్ల వృద్ధురాలు

Posted On 2026-07-05 17:09:50

Readmore >
Image 1

ఒవైసీ కాలేజ్ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్!!

Posted On 2026-07-05 17:08:44

Readmore >
Image 1

ఏలూరు జిల్లాలో విషాదం... రైలు ఢీకొని నలుగురి మృతి

Posted On 2026-07-05 11:44:43

Readmore >
Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >