| Daily భారత్
Logo




రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్, రోటరీ క్లబ్ ఆఫ్ జగిత్యాల సెంట్రల్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం

News

Posted on 2025-12-03 18:41:43

Share: Share


రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్, రోటరీ క్లబ్ ఆఫ్ జగిత్యాల సెంట్రల్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్, రోటరీ క్లబ్ ఆఫ్ జగిత్యాల సెంట్రల్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ రోటరీ సర్వీసెస్ ట్రస్ట్ వారి సహకారంతో, ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఉచిత కృత్రిమ కాలు (జైపూర్ ఫుట్) పంపిణీ శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, దివ్యాంగులకు కృత్రిమ కాలును అందజేసి ఆశీర్వచనాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రోటరీ క్లబ్ వారు చేస్తున్న సేవ  దివ్యాంగుల జీవితల్లో వెలుగులను తీసుకొని వస్తుందని, రోటరీ క్లబ్ ట్రస్ట్  వారు 2009 నుండి సేవ కార్యక్రమలు చేయడం అభినందనీయం.. దివ్యాంగులకు కృత్రిమ కాలును అమర్చి వారికి నూతన ఉత్తేజాన్ని కల్పిస్తున్న ఈ రోటరీ క్లబ్ ట్రస్ట్ వారి సేవ అభినందనీయమని కొనియాడారు. దివ్యాంగుల పునరావాసం, సాధికారత కోసం రోటరీ చేస్తున్న సేవలను కొనియాడారు. సమాజంలో దివ్యాంగుల పట్ల సహానుభూతితో అందరూ ముందుకొస్తే వారి జీవితాల్లో వెలుగు వస్తుంది అని తెలిపారు. ఈ సందర్భంగా, నిజామాబాద్ రోటరీ సర్వీసెస్ ట్రస్ట్‌కు ప్రతి సంవత్సరం ఎమ్మెల్యే  ట్రస్ట్ ద్వారా  రూ. 2,00,000 (రెండు లక్షల రూపాయల) ఆర్థిక సాయం అందిస్తానని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే  ప్రకటించారు. అదేవిధంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా   ఎటువంటి సహాయ సహకారాలైన అందిస్తానని తెలియజేశారు..ఈ నిర్ణయం సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేసేందుకు తోడ్పడుతుందని అని అన్నారు. ఈ కార్యక్రమంలో  ఎన్.ఆర్.సి.టి  చైర్మన్ ఆకులఅశోక్,రోటరీ క్లబ్ అధ్యక్షులు శ్యామ్ అగర్వాల్, కార్యదర్శి గోవింద్ జవహర్, కోశాధికారి జుగల్ రాజు, బీజేపీ నాయకులు, లబ్ధిదారులు  పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Image 1

బడిపంతులుగా మారిన ఎస్పీ నరసింహ ఐపీఎస్

Posted On 2026-06-20 12:14:40

Readmore >
Image 1

నకిలీ బంగారం చూపి దోపిడీ.. ఏడుగురు ముఠా సభ్యుల అరెస్ట్

Posted On 2026-06-20 07:55:27

Readmore >
Image 1

ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS

Posted On 2026-06-19 21:55:09

Readmore >
Image 1

నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం

Posted On 2026-06-19 20:54:23

Readmore >
Image 1

గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-06-19 20:36:40

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్‌ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్‌

Posted On 2026-06-19 20:33:12

Readmore >
Image 1

రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం

Posted On 2026-06-19 19:17:58

Readmore >
Image 1

భూవివాదాలు లేని తెలంగాణ నిర్మాణ‌మే లక్ష్యం

Posted On 2026-06-19 19:13:38

Readmore >
Image 1

గాంధీ సరోవర్‌ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్

Posted On 2026-06-19 19:11:46

Readmore >
Image 1

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీవీఎంసీ ఉద్యోగి

Posted On 2026-06-19 19:00:24

Readmore >