Posted on 2025-12-03 18:40:31
బీజేపీ జిల్లా అధ్యక్షులు, దినేష్ పటేల్ కులాచారి డిమాండ్..
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిజామాబాదు నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తా వద్ద బుధవారం నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపారు.
ఈ సందర్బంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి మాట్లాడుతూ...
మొన్న సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవి దేవతలను అవమానించేలా చేసిన వ్యాఖ్యలు క్షమించలేనివని అన్నారు. ఇవన్నీ ఒక వర్గం ఓట్ల కోసం చేస్తున్న రాజకీయ నాటకమని దినేష్ పటేల్ కులాచారి తీవ్రంగా విమర్శించారు. ఒక వర్గం మన్ననలు పొందడానికి హిందువులను బాధించే వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ నాయకుల సంప్రదాయమైపోయిందని ఆయన మండిపడ్డారు.
హిందూ దేవతల్ని అవమానించి, తర్వాత రాజకీయ లబ్ధి కోసం మళ్లీ జాగ్రత్తగా నటించడం రేవంత్ స్టైల్ అని, కానీ ఈసారి హిందూ సమాజం మీ నాటకం నమ్మదు అని దినేష్ పటేల్ కులాచారి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యత లేకుండా, గౌరవం లేకుండా మాట్లాడటం చూసి రాష్ట్ర ప్రజలు సిగ్గుపడాల్సిన పరిస్థితే వచ్చింది అని అన్నారు. ఒక వర్గం ఓట్ల కోసం హిందూ భావాలను రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తే, బీజేపీ జిల్లా వ్యాప్తంగా పోరాటం చేస్తుందని ఆయన హెచ్చరించారు. హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసే ధైర్యం మీకు ఎవరు ఇచ్చారు? వెంటనే ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పండి. లేదంటే మీ ప్రభుత్వమే ప్రజల కోపంతో కూలిపోతుందని దినేష్ కులాచారి స్పష్టం చేశారు. హిందూ సమాజాన్ని అవమానించే ఔట్‌డేటెడ్ రాజకీయాలు ఇక పనిచేయవని, ఇలాంటి వ్యాఖ్యలను ప్రజలు అస్సలు సహించరని అన్నారు. మత రాజకీయాల మీద మాట్లాడే కాంగ్రెస్ హిందువులు రేవంత్ ఖాన్ మాట్లాడిన మాటలకూ నోరు లేవడం లేదు ఎందుకు అని ప్రశ్నించారు? ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు పోతంకర్ లక్ష్మి నారాయణ, నాగోల్ల లక్ష్మి నారాయణ, ఆకుల శ్రీనివాస్, బూరుగుల వినోద్,ఇప్పకాయల కిషోర్,మల్లేష్ గుప్తా, గడ్డం రాజు, అంబదాస్ రావు, గిరిబాబు, యాదల నరేష్, ఆమందు విజయ్ కృష్ణ, ఆనంద్, చిరంజీవి బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >