Posted on 2025-12-04 21:17:31
దత్తాత్రేయుని ఆలయాల్లో పోటెత్తిన భక్తులు పోటెత్తిన భక్తులు
జిల్లా కేంద్రంలోని సద్గురు దామము సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక వేడుకలు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: దత్తాత్రేయునికి ఎంతో ప్రీతికరమైన నామస్మరణం దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా అనే శ్లోకంతో దత్త పౌర్ణమి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా దత్తాత్రేయుని జన్మదిన వేడుకలు అంబరాన్ని అంటాయి. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ లో 100 ఫీట్ రోడ్లో గల శ్రీ సద్గురు దామం సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన దత్త జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇప్పకాయల హరిదాస్ స్వామీ ఆధ్వర్యంలో తెల్లవారుజామున నుండి ఉత్సవాలు జరిగాయి. అలాగే ఆలయ ప్రాంగణంలో సామూహిక యజ్ఞ హోమం కార్యక్రమాలు, శ్రీ అనఘా దత్తాత్రేయునికి తెల్లవారుజామున నుండి ప్రత్యేక అభిషేక అర్చన కార్యక్రమాలు ఆలయ ట్రస్ట్ కమిటీ నిర్వాహకులు నిర్వహించారు. దత్త జయంతి రోజున దత్తాత్రేయుని స్వయంగా పూజిస్తే పూజా కార్యక్రమాల్లో పాల్గొంటే కోరిన కోరికలు తీరుతాయని ప్రగాఢ నమ్మకాలు ప్రజల్లో ఉన్నాయి. అందుకే గురువారం దత్త జయంతి దత్త పౌర్ణమి కావడంతో వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అలాగే దత్తాత్రేయ స్వామి వారికి దూలారహోనంతో పాటు వివిధ పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించడంతోపాటు డోలారోహణం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ట్రస్టు సభ్యులు ఎమ్మెల్యేకు సన్మానించారు. అనంతరం భారీ సంఖ్యలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS
Posted On 2026-06-19 21:55:09
Readmore >
నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
Posted On 2026-06-19 20:54:23
Readmore >
గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-06-19 20:36:40
Readmore >
ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్
Posted On 2026-06-19 20:33:12
Readmore >
రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-19 19:17:58
Readmore >
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్
Posted On 2026-06-19 19:11:46
Readmore >
దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-06-19 17:52:08
Readmore >
ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం
Posted On 2026-06-19 16:50:47
Readmore >