| Daily భారత్
Logo




నిజామాబాద్‌ రూరల్‌లో బీసీలకు 51.6 శాతం రిజర్వేషన్లు కల్పించాం : రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి

News

Posted on 2025-12-04 21:31:14

Share: Share


నిజామాబాద్‌ రూరల్‌లో బీసీలకు 51.6 శాతం రిజర్వేషన్లు కల్పించాం : రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 51.6 శాతం రిజర్వేషన్లు కల్పించామని ఎమ్మెల్యే డాక్టర్‌ ఆర్. భూపతిరెడ్డి తెలిపారు. గురువారం నగర శివారులోని క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో నాన్‌ షెడ్యూల్‌ 126 గ్రామపంచాయతీలు ఉన్నాయని, వాటిలోని 64 జనరల్‌ స్థానాల్లో 32 సీట్లు బీసీలకు కేటాయించామని తెలిపారు. బీసీల రిజర్వేషన్లను 51.6 శాతం వరకూ పెంచి సామాజిక న్యాయాన్ని అమలు చేశామని అన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో పేర్కొన్న విధంగా 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి కాంగ్రెస్‌ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. బీజేపీ–బీఆర్‌ఎస్ కలిసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు రాకుండా అడ్డుకుంటున్నాయని విమర్శించారు. బీజేపీ ఎంపీలు పార్లమెంట్‌లో బీసీ బిల్లుపై రాజకీయ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. బీసీలకు న్యాయం చేసేదేమిటో ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఏకగ్రీవ గ్రామపంచాయతీలకు ప్రోత్సాహకం

నియోజకవర్గంలో ఏకగ్రీవమైన మేజర్‌ గ్రామపంచాయతీలకు ప్రత్యేక నిధుల నుంచి రూ.20 లక్షలు, మైనర్‌ జీపీలకు రూ.10 లక్షల ప్రోత్సాహకం ఇస్తామని ఎమ్మెల్యే భూపతిరెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ తరఫున ఇప్పటికే ఏకగ్రీవ జీపీలకు రూ.10 లక్షలు ప్రకటించారని గుర్తుచేశారు. ఇప్పటివరకు 33 జీపీలు ఏకగ్రీవమయ్యాయని, మరో రెండు రోజుల్లో మరికొన్ని ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉందని తెలిపారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్‌ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్‌ బాడ్సి శేఖర్‌ గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్కోల్‌ భాస్కర్‌రెడ్డి, ఎస్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు కెతావత్‌ యాదగిరి, నాయకులు మునిపల్లి సాయిరెడ్డి, బాగారెడ్డి, అమృతాపూర్‌ గంగాధర్‌, నవీన్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Image 1

ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS

Posted On 2026-06-19 21:55:09

Readmore >
Image 1

నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం

Posted On 2026-06-19 20:54:23

Readmore >
Image 1

గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-06-19 20:36:40

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్‌ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్‌

Posted On 2026-06-19 20:33:12

Readmore >
Image 1

రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం

Posted On 2026-06-19 19:17:58

Readmore >
Image 1

భూవివాదాలు లేని తెలంగాణ నిర్మాణ‌మే లక్ష్యం

Posted On 2026-06-19 19:13:38

Readmore >
Image 1

గాంధీ సరోవర్‌ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్

Posted On 2026-06-19 19:11:46

Readmore >
Image 1

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీవీఎంసీ ఉద్యోగి

Posted On 2026-06-19 19:00:24

Readmore >
Image 1

దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-06-19 17:52:08

Readmore >
Image 1

ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం

Posted On 2026-06-19 16:50:47

Readmore >