| Daily భారత్
Logo




చండ్రుగొండ మండలంలో 280 క్వింటాలరేషన్ బియ్యం పట్టివేత

News

Posted on 2025-12-06 15:34:05

Share: Share


చండ్రుగొండ మండలంలో 280 క్వింటాలరేషన్ బియ్యం పట్టివేత

డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాచంద్రుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై గట్టి నిఘా కొనసాగుతోంది. ఈ క్రమంలో భారీ స్థాయిలో రేషన్ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తుండగా చంద్రుగొండ పోలీసు వారు పట్టుకున్నారు. చంద్రుగొండ పోలీసు వారు వాహన తనిఖీలలో భాగంగా తనిఖీ చేస్తుండగా  గూడ్స్ క్యారియర్ లారీని ఆపి తనిఖీ చేయగా, అందులో ప్రజా పంపిణీ వ్యవస్థకు చెందిన 280 క్వింటాళ్లు రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. బియ్యం  విలువ రూ. 5,60,000/-. వాహన డ్రైవర్ అరుణ్ కుమార్ రాజ్‌బార్ విచారణలో, రేషన్ బియ్యాన్ని తక్కువ ధరలకు ఆంధ్ర మరియు తదితర ప్రాంతాలలో కొనుగోలు చేసి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు అధిక ధరలకు అమ్మే అక్రమ వ్యవస్థలో తాము భాగస్వాములమని, ఇందులో లారీ యొక్క యజమాని మరియు మరికొందరు వ్యక్తులు కూడా ఉన్నారని పోలీసులకు ఒప్పుకున్నాడు.

పోలీసులు అశోక్ లేలాండ్ లారీ CG 17 KZ 8355, 280 క్వింటాళ్ల  రేషన్ బియ్యం మరియు మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి ఈరోజు జ్యుడీషియల్  రిమాండ్‌కు పంపించారు.ఈ ఆపరేషన్ మొత్తం కొత్తగూడెం డి.ఎస్.పి అబ్దుల్ రెహమాన్  మార్గదర్శకత్వంలో మరియు జూలూరుపాడు సి.ఐ శ్రీలక్ష్మి పర్యవేక్షణలో చంద్రుగొండ పోలీస్ వారు సమర్థవంతంగా నిర్వహించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా, నిల్వ మరియు విక్రయానికి సంబంధించి ఎటువంటి వ్యక్తులైనా కఠిన చర్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమంలో చుండ్రుగొండ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-14 13:11:06

Readmore >
Image 1

తిరుమల నిశ్శబ్దంలో భక్తి దీపం : మంజుల పత్తిపాటి

Posted On 2026-06-14 13:07:39

Readmore >
Image 1

షాబాద్‌ ఉన్నత పాఠశాలో సమస్త పూర్వ విద్యార్థుల

Posted On 2026-06-14 13:04:49

Readmore >