Posted on 2025-12-13 18:20:51
బిక్ష కోసం వచ్చిన స్వాములకు స్వయంగా తన చేతులతో ఆహారం వడ్డించిన అర్బన్ ఎమ్మెల్యే
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ నగరంలోని అయ్యప్ప స్వాముల బృందం ఆధ్వర్యంలో అయ్యప్ప పంభా ఆరట్టు మహోత్సవం ఊరేగింపు కార్యక్రమం భక్తిశ్రద్ధలు, ఆధ్యాత్మిక వాతావరణం మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవ ఊరేగింపు అయ్యప్ప స్వామి ఆలయం నుండి ప్రారంభమై రఘునాథ చెరువు వరకు అత్యంత భక్తి శ్రద్ధలతో అయ్యప్ప నామస్మరణలతో ఈ కార్యక్రమం శోభాయమానంగా ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ కొబ్బరికాయ కొట్టి రథాన్ని ప్రారంభించి అధికారికంగా ఆరంభించారు. రఘునాథ చెరువు వద్ద అయ్యప్ప స్వామి విగ్రహానికి సంప్రదాయబద్ధంగా అభిషేక పూజలు, స్నాన కార్యక్రమాలు, విశేష పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. అనంతరం అయ్యప్ప బృందం ఆధ్వర్యంలో భక్తుల కోసం బిక్ష (అన్నదానం) కార్యక్రమం ఏర్పాటు చేయగా, పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొని స్వామి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ, అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆరోగ్యవంతంగా ఉండాలని ఆకాంక్షించారు. ధర్మం, భక్తి, క్రమశిక్షణను పెంపొందించే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతి, ఐక్యతను బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. అలాగే రఘునాథ చెరువులో అయ్యప్ప స్వామి ఉత్సవమూర్తులకు అభిషేకలు నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు పూర్తైన అనంతరం అయ్యప్ప స్వామి విగ్రహాన్ని మళ్లీ ఊరేగింపుగా అయ్యప్ప స్వామి ఆలయానికి తీసుకువెళ్లారు. ఆలయంలో సాయంత్రం అయ్యప్ప స్వామికి సంప్రదాయబద్ధంగా పడిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ మొత్తం కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొని శరణు ఘోషలు, భజనలతో భక్తి పారవశ్యాన్ని చాటారు. కార్యక్రమం శాంతియుతంగా, విజయవంతంగా ముగిసింది. కార్యక్రమంలో అయ్యప్ప ఆలయ చైర్మన్ భక్తవత్సలం, అయ్యప్ప స్వాములు మంచాల జ్ఞానేందర్ గుప్తా, గజవాడ ఆగమయ్య, యాంసాని రవీందర్, నేతి శేఖర్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >