| Daily భారత్
Logo




ఓటు హక్కు కేవలం హక్కు మాత్రమే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత

News

Posted on 2025-12-14 00:07:49

Share: Share


ఓటు హక్కు కేవలం హక్కు మాత్రమే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత

డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా : ప్రజాస్వామ్యం వర్థిల్లాలంటే ప్రతీ పౌరుడు ప్రజాస్వామిక సంస్కారాన్ని అలవరుచుకోవాలి. అది ఎక్కడో లేదు, నీలోనే ఉందని జాతిపిత మహాత్మాగాంధీ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే పౌరులు తన బాధ్యత తెలుసుకోవాలి. రాష్ట్రం,గ్రామం,ప్రతి వాడా అభివృద్ధి చెందాలి, మనందరం బాగుండాలి అనే తాపత్రయం ఉంటేనే సరిపోదు, అందుకు ప్రతీ పౌరుడు ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగం కల్పించిన ఆయుధం ఓటు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే నిర్ణేతలు.  ఓటు అనేది సాధారణ గుర్తు కాదు, పౌరుడు దేశ, రాష్ట్ర, గ్రామ  భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి” అని పేర్కొన్నారు.మనం నివసిస్తున్న దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అంటే ప్రజల మాటే పరమాధికారం. ఇలాంటి వ్యవస్థలో పౌరుడు పొందే అత్యంత విలువైన హక్కు ఓటు హక్కు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం, 18 సంవత్సరాలు పూర్తయిన ప్రతి భారత పౌరుడు ఓటు వేసే హక్కును పొందుతాడు. ఈ హక్కు ప్రతి ఒక్కరికీ సమానంగా లభించడం మన ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనం. ప్రజలు కులం, మతం, డబ్బు, మద్యం వంటి ప్రభావాలకు లోనుకాకుండా అభ్యర్థుల సేవాభావం, నిజాయితీ, పని తీరు మాత్రమే పరిశీలించి ఓటు వేయాలని ఆయన సూచించారు. ఓటు వేయకపోవడం అనేది ప్రజాస్వామ్యానికి నష్టం చేయడమేనని, ఒక చిన్న ఓటే మంచి నాయకులను ముందుకు తెచ్చే శక్తి కలిగి ఉంటుంది. ఎన్నికల సమయంలో యువత ఎక్కువగా జాగ్రత్తగా ఉండి, తన హక్కును వినియోగించడమే కాక, ఇతరులకు కూడా అవగాహన కల్పించాలి. ప్రతి పౌరుడు ఓటు వేయడం ద్వారా దేశ అభివృద్ధికి తోడ్పడాలి. మన ఓటు మన భవిష్యత్తు ను నిర్ణయిస్తుంది కాబట్టి అందరు ఓటు వేయాలని ఆపేక్షించారు.

Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 08:04:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 19:39:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 19:32:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 19:30:41

Readmore >
Image 1

కాలినడక ద్వారా తిరుమలకు చేరిన 116 ఏళ్ల వృద్ధురాలు

Posted On 2026-07-05 17:09:50

Readmore >
Image 1

ఒవైసీ కాలేజ్ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్!!

Posted On 2026-07-05 17:08:44

Readmore >
Image 1

ఏలూరు జిల్లాలో విషాదం... రైలు ఢీకొని నలుగురి మృతి

Posted On 2026-07-05 11:44:43

Readmore >
Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >
Image 1

అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-07-04 14:03:34

Readmore >