Posted on 2025-12-15 14:26:33
కేసీర్ ప్రజల కడుపు నింపితే కాంగ్రెస్ నేతలు జేబులు నింపుకుంటున్నారు
సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్
డైలీ భారత్ న్యూస్, హుజూర్ నగర్:హుజూర్ నగర్ నియోజకవర్గం గరిడేపల్లి మండలం పొనుగోడు, గడ్డిపల్లి, కుతుబ్షా పురం గ్రామాలలో హుజూర్ నగర్ బీఆర్ఎస్ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, ప్రజాప్రతినిధులు స్థానిక నేతలతో కలిసి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ పెరిగిందని కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలు అర్ధం చేసుకున్నారని తెలిపారు. కేసీర్ పదేండ్ల లో చేసిన అభివృద్ధి కండ్లముందే కనబడుతుందని తప్ప రెండేళ్ల ప్రజా పాలనలో రూపాయి పని చేసిన పాపానపోలేదన్నారు. కేసీర్ ప్రవేశపెట్టిన పథకాలనే సక్కగా కొనసాగించ లేని కాంగ్రెస్ పార్టీ ఇంకా కొత్తగా ఏదో చేస్తామంటే ప్రజలు నమ్మరన్నారు.కేసీర్ ప్రజల కడుపు నింపితే కాంగ్రెస్ జేబులు నింపుకునే పనిలో ఉందని ఇచ్చిన హామీలు అమలు చేయలేక ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెడుతున్నారని అనేకచోట్ల పోలీసులు దుర్మార్గంగా వ్యవహావరిస్తున్నారని పలుచోట్ల ఏస్ఐ లు కార్యకర్తలుగా పనిచేస్తున్నారని అమాయకులను స్టేషన్ కు పిలిపించి ఇబ్బందులు పెడుతున్నారని రౌడీ షీటర్లుగా ఉన్న కాంగ్రెస్ గుండాలను దర్జాగా తిప్పుతున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు ఎంతో కాలం నిలబడవని రేవంత్ మాయమాటలతో మోసం చేశాడని ప్రజలకు అర్థమైందని కేసీఆర్ ను వదులుకున్నామనే పశ్చాత్తాపం మొదలై బీఆర్ఎస్ నేతలు స్థానిక ఎన్నికల్లో సైనికుల్లా పనిచేస్తున్నారని మరో రెండేళ్లలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని జోస్యం చెప్పారు
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >